ETV Bharat / bharat

'టీవీ ఉంటే రేషన్​ కార్డ్ కట్'​... నిజమెంత? - కర్ణాటక పౌర సరఫరా శాఖ మంత్రి ఉమేష్​ కట్టి

'టీవీ ఉంటే రేషన్​కార్డు కట్​' అని కర్ణాటకవ్యాప్తంగా కలకలం రేపిన వార్తలు అవాస్తవమని తేలింది. ఈ విషయమై స్పష్టత నిచ్చిన యడియూరప్ప సర్కార్​.. ప్రస్తుతం ఉన్న బీపీఎల్ నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయడం లేదని తేల్చిచెప్పింది.

Umesh Katti
మంత్రి ఉమేష్​ కట్టి
author img

By

Published : Feb 15, 2021, 5:42 PM IST

టీవీ, ఫ్రిజ్​, ద్విచక్ర వాహనం, కనీసం ఐదెకరాల భూమి ఉన్న కుటుంబాలకు ఇకపై రేషన్​కార్డు ఉండదనే వార్తలు కర్ణాటకలో కలకలం రేపాయి. అయితే.. ఆ వార్తలు అవాస్తవమని కాసేపటికే వివరణ ఇచ్చింది పౌర సరఫరాల శాఖ.

రాష్ట్రవ్యాప్తంగా రేషన్​కార్డులను తగ్గించాలని.. ఇందుకోసం ప్రభుత్వం బీపీఎల్​ నిబంధనల్ని మారుస్తున్నట్టు వార్తలొచ్చాయి. టీవీ, ఫ్రిజ్​, బైక్​, ఐదెకరాల భూమి కలిగి ఉన్న కుటుంబాల బియ్యం కార్డులు రద్దు కానున్నాయని పౌర సరఫరాల మంత్రి ఉమేశ్ కట్టి వ్యాఖ్యానించినట్టు ఊహాగానాలు జోరుగా వినిపించాయి. దీంతో యడియూరప్ప సర్కార్​పై విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాయి. అయితే.. ఆ వార్తలు అవాస్తవమని.. ప్రస్తుతం ఉన్న బీపీఎల్​ నిబంధనల్లో ఎలాంటి మార్పులూ చేపట్టడం లేదని స్పష్టం చేశారు ఉమేశ్​.

అయితే.. గత ప్రభుత్వంలో అర్హత లేకపోయినా చాలా మంది చట్ట విరుద్ధంగా రేషన్​కార్డులు పొందారని, కేవలం వారిపైనే చర్యలు తీసుకోబోతున్నామని ఉమేశ్​ చెప్పారు. అలాంటి వారు తక్షణమే స్పందించి స్వచ్ఛందంగా తమ కార్డులను వచ్చే నెలాఖరులోగా ప్రభుత్వానికి అప్పగించాలని కోరినట్టు తెలిపారు. నిర్ధిష్ట గడువులోగా వారు స్పందికపోతే.. చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: సీఎం కుమార్తెను మోసగించిన ముగ్గురు అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.