ఓ మహిళ.. తనకు పుట్టిన బిడ్డను రూ.5000కు అమ్మేసింది. కొన్ని రోజుల తర్వాత మళ్లీ వచ్చి తన బిడ్డను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. కర్ణాటక విజయపురలోని జిల్లా ఆస్పత్రిలో జరిగింది ఈ వ్యవహారం.
ఇదీ జరిగింది
విజయపుర జిల్లా తికోట గ్రామానికి చెందిన రేణుక.. జిల్లా ఆస్పత్రిలో ఆగస్టు 19న ఓ బిడ్డకు (రెండో కాన్పు) జన్మనిచ్చింది. అయితే రెండో బిడ్డను చూసుకునే స్తోమత లేకపోవడం వల్ల తన బిడ్డను అమ్మేయాలని నిర్ణయించుకుంది రేణుక. ఇందుకు ఆస్పత్రిలోని కస్తూరి అనే నర్సుతో స్నేహం చేసింది. ఆ నర్సు ద్వారానే తన బిడ్డను ఆగస్టు 26న రూ.5000కు అమ్మేసింది. అయితే కొన్ని రోజుల తర్వాత మళ్లీ ఆస్పత్రికి వచ్చిన రేణుక.. తన బిడ్డను తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేసింది. దీనికి తిరస్కరించిన కస్తూరి.. బిడ్డను తిరిగి ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది.
దీంతో మహిళ పోలీస్ స్టేషన్లో కస్తూరిపై ఫిర్యాదు చేసింది రేణుక. ఫలితంగా నర్సును సస్పెండ్ చేశారు. అధికారులు. అలాగే కస్తూరిపై మొత్తంగా మూడు కేసులు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: కల్తీ రక్తంతో అక్రమ దందా- డాక్టర్ అరెస్ట్