KGF babu karnataka: వందల కోట్ల అధిపతి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. ఆయనే బెంగళూరు నగర కాంగ్రెస్ అభ్యర్థి యూసుఫ్ షరీఫ్ (Yusuf shariff kgf). ఈయనను కేజీఎఫ్ బాబు అని పిలుచుకుంటారు. మండలి ఎన్నికల బరిలో ఉన్నవారిలో అత్యంత ధనవంతుడిగా నిలిచారు.
వ్యాపారవేత్త అయిన కేజీఎఫ్ బాబు.. బెంగళూరు రాజకీయ నాయకుల్లోని అత్యంత ధనవంతుల్లో (Richest politician in karnataka list) ఒకరు. తనకు రూ. 1643 కోట్లు ఆస్తి ఉన్నట్లు తన అఫిడవిట్లో పేర్కొన్నారు.
డిసెంబర్ 10న కర్ణాటకలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. 14న ఫలితాలు ప్రకటించనున్నారు.

ఈ నేపథ్యంలోనే.. మంగళవారం నామినేషన్ వేసిన కేజీఎఫ్ బాబు(Karnataka mlc elections).. తన ఆస్తి వివరాలు వెల్లడించారు.

ఆస్తి వివరాలు..
- ఆస్తి మొత్తం- రూ. 1643 కోట్లు
- బ్యాంకు ఖాతాలు- 23
- అప్పులు- రూ. 58 కోట్లు
రూ. 2 కోట్ల 99 లక్షలు విలువ చేసే 3 కార్లు, కోటికిపైగా విలువైన వాచ్, 4.5 కేజీల బంగారం, రూ. 48 కోట్ల విలువైన వ్యవసాయ భూములు, రూ. 1593 కోట్ల విలువైన స్థలాలు ఉన్నాయి.


ఇవీ చూడండి: మలాశయంలో ఇరుక్కున్న టాయిలెట్ స్ప్రేయర్- చివరకు...