ETV Bharat / bharat

'చస్తే మరీ మంచిది'- మంత్రి వివాదాస్పద వ్యాఖ్య - రైతుతో కర్ణాటక మంత్రి ఫోన్ సంభాషణ

కర్ణాటక పౌర సరఫరాల మంత్రి ఉమేష్ కత్తికి, ఒక రైతుకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణ వైరల్​గా మారింది. అవసరమైతే చనిపో అంటూ రైతుకు మంత్రి దురుసు సమాధానమిచ్చారు. దీంతో రమేశ్ కత్తి తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు.

Karnataka minister ramesh katti
కర్ణాటక మంత్రి రమేశ్ కట్టి
author img

By

Published : Apr 29, 2021, 7:40 AM IST

'బతకలేకపోతే.. చస్తే మరీ మంచిది. మేమిచ్చేది ఇంతే' అని ఐదు కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వాలని కోరిన ఓ ఉద్యమ ఆందోళనకారుడికి కర్ణాటక రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల మంత్రి ఉమేశ్‌ కత్తి ఇచ్చిన సమాధానం ఇది. ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమవడంతో తాను మాట్లాడింది నిజమేనంటూ అంగీకరించిన మంత్రి.. చివరకు క్షమాపణ చెప్పారు.

రాష్ట్రంలో ఉచితంగా ఇవ్వాల్సిన ఐదు కిలోల బియ్యాన్ని రెండు కిలోలకు తగ్గించిన సర్కారు.. ప్రత్యామ్నాయంగా గోధుమలు, జొన్నలు ఇస్తోంది. లాక్‌డౌన్‌ సమయంలో రెండు కిలోల బియ్యం ఏమాత్రం సరిపోవని గదగ జిల్లాలో రైతులు ఆందోళనబాట పట్టారు. సమస్య తీవ్రతను ఆందోళనకారుల్లో ఒకరైన ఈశ్వర ఆర్య బుధవారం మంత్రికి ఫోన్‌ చేసి వివరించారు. ఈ సందర్భంగా 'బతకలేకపోతే.. చస్తే మరీ మంచిది. మేమిచ్చేది ఇంతే' అంటూ కఠినంగా బదులిచ్చారు.

ఇవీ చదవండి: సీడీ కేసులో కర్ణాటక మంత్రి రాజీనామా

కర్ణాటక మంత్రిపై లైంగిక వేధింపుల ఆరోపణలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.