ETV Bharat / bharat

ఆ వీడియో లీక్ చేస్తానని మంత్రికి బెదిరింపులు.. చివరకు... - కర్ణాటక మంత్రి సోమశేఖర్​

Karnataka Minister CD case: అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ప్రైవేటు వీడియోను సామాజిక మాధ్యమాల్లో లీక్​ చేస్తామని కేబినెట్ మంత్రినే బెదిరించాడు ఓ వ్యక్తి. ఆయన కుమారుడికి కూడా వాట్సాప్​ కాల్​ చేసి బ్లాక్​మెయిల్​ చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేశారు.

Karnataka Minister and his Son Blackmailed
ప్రైవేట్​ వీడియో లీక్​ చేస్తానని కేబినెట్​ మంత్రి, కుమారుడికి బెదిరింపులు
author img

By

Published : Jan 10, 2022, 1:54 PM IST

Karnataka Minister CD Case: కర్ణాటక కేబినెట్​ మంత్రి, ఆయన కుమారుడిని బ్లాక్​మెయిల్​ చేశాడో వ్యక్తి. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వాళ్లకు చెందిన ఓ ప్రైవేటు వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానని బెదిరించాడు. దీంతో మంత్రి కుమారుడు పోలీసులను ఆశ్రయించారు. వెంటనే వారు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని ఓ జ్యోతిషుడి కుమారుడు రాహుల్ భట్​గా గుర్తించారు. ఈ వ్యవహారంతో ఇంకా ఎవవరెవరికి సంబంధాలు ఉన్నాయనే విషయంపై దర్యాప్తు ముమ్మరం చేశారు.

సీసీబీ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. కర్ణాటక సహకార మంత్రి ఎస్టీ సోమశేఖర్​కు సంబంధించిన వీడియోనూ అతని వ్యక్తిగత కార్యదర్శికి నిందితుడు డిసెంబర్ చివరివారంలో పంపాడు. డబ్బులు ఇవ్వకపోతే ఫేస్​బుక్​, ట్విట్టర్​లో దాన్ని పోస్టు చేస్తానని హెచ్చరించాడు. డిసెంబర్ 25 సోమశేఖర్​ కుమారుడు నిశాంత్​ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనతో పాటు తన తండ్రి రాజకీయ జీవితాన్ని దెబ్బ తీసేందుకు తన ప్రైవేటు వీడియోలోని చిత్రాలను పంపి ఓ ఆగంతుకుడు బెదిరించాడని పేర్కొన్నారు. తనకు వాట్సాప్​ కాల్ కూడా చేసినట్లు తెలిపారు.

అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు ఐదు రోజుల దర్యాప్తు అనంతరం రాహుల్​ భట్​ను అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరిచి ఐదురోజులు కస్టడీలోకి తీసుకున్నారు.

Minister Blackmail news

అయితే ఈ వ్యవహారంతో ఓ రాజకీయ నేత కుమార్తె సహా మరికొంత మందికి సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీడియో పంపింది ఇందీ నియోజకవర్గ కాంగ్రెస్​ ఎమ్మెల్యే యశ్వంత్ రావ్​ పాటిల్​ కూతురు మొబైల్ నంబర్​ నుంచే అని ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు.

యశ్వంత్​ పాటిల్​ కూడా ఈ విషయంపై స్పందించారు. మీడియా సమావేశంలో అన్ని వివరాలు వెల్లడిస్తానన్నారు.

ఇదీ చదవండి: పక్షవాతంతో బాధపడుతున్న కొడుకును చంపిన తండ్రి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.