ETV Bharat / bharat

ఒకే కాలుతో శిశువు జననం- ఎక్కడంటే... - అసోం వార్తలు

కర్ణాటకలో ఓ వింత శిశవు జన్మించింది. ఒకే కాలుతో ఉన్న ఆ శిశువు ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. మరో ఘటనలో అసోంకు చెందిన ఓ మహిళ 5.2 కిలోల బరువున్న శిశువుకు జన్మనిచ్చింది.

Single legged baby born in Hubli
ఒకే కాలుతో శిశువు జననం.. ఎక్కడంటే?
author img

By

Published : Jun 21, 2021, 12:45 PM IST

కర్ణాటక హుబ్లీలోని కిమ్స్ ఆసుపత్రిలో ఒక కాలితోనే శిశువు జన్మించిన ఘటన వెలుగుచూసింది. ప్రసవ వేదనతో బాధపడుతున్న ఒక మహిళను బంధువులు ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకు సిజేరియన్ చేసి అనంతరం పుట్టిన శిశువును చూసి ఆశ్చర్యపోయారు.

Single legged baby born in Hubli
ఒకే కాలుతో జన్మించిన శిశువు

నడుము కింద ఒక కాలు తప్ప సాధారణ శరీర భాగాలేమీ లేకుండానే జన్మించిన అరుదైన శిశువు ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

బాల భీముడి జననం..

అసోం సిల్చార్​లో జయదాస్​ అనే మహిళ ఏకంగా 5.2కిలోల బరువున్న బాలుడికి జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, బాల భీముడైన శిశువు ఆరోగ్యం మెరుగ్గానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

5.2kgs baby
అసోంలో జన్మించిన బాలభీముడు
5.2kgs baby
5.2కిలోల బరువున్న శిశువుతో సెల్ఫీ
5.2kgs baby
5.2కిలోల బరువున్న శిశువుతో ఆసుపత్రి సిబ్బంది

"సాధారణంగా భారతదేశంలో పుట్టే పిల్లల సగటు బరువు 2.5-3 కిలోలే. 4 కిలోల బరువుతో పుట్టడమే అరుదు. ఇక 5 కిలోలు అంటే అసాధారణమనే చెప్పాలి."

-డాక్టర్ అఫ్సర్ అస్లాం, సిల్చార్ సివిల్ ఆసుపత్రి

కనక్​పుర్​కు చెందిన జయ దాస్ మొదటి సంతానం 3.8 కిలోల బరువుతో జన్మించినట్లు వైద్యులు తెలిపారు. సాధారణంగా తల్లికి మధుమేహం ఉంటే పిల్లలు అధిక బరువుతో పుడతారని, అయితే.. జయదాస్ మధుమేహ రోగి కాదని వైద్యులు తెలిపారు.

ఇప్పటివరకు ఉన్న రికార్డులు..

  • 2016లో కర్ణాటకకు చెందిన 20 ఏళ్ల నందిని అనే మహిళ 6.8 కిలోల బరువున్న శిశువుకు జన్మనిచ్చింది.
  • 2015లో ఉత్తరప్రదేశ్‌లో ఫిర్దౌస్ ఖాతున్ అనే మహిళ 6.7 కిలోల బరువున్న శిశువుకు జన్మనిచ్చింది.
  • 1955లో ఇటలీలోని అవెర్సాలో కార్మెలినా ఫెడెలే అనే మహిళ 10.2కిలోల బరువున్న బాలుడికి జన్మనిచ్చిన ఘటనే ఇప్పటివరకు ప్రపంచ రికార్డుగా ఉంది.

ఇవీ చదవండి: దేవుడి పేరు చెప్పి బాలికకు తాళి కట్టిన పాస్టర్

మద్యం మత్తులో పాదం నరుక్కున్న వ్యక్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.