Karnataka High Court Hijab: భారత రాజ్యాంగానిది సునిశిత లౌకికవాదమని, టర్కీ మాదిరిగా నెగెటివ్ సెక్యులరిజం కాదని సీనియర్ అడ్వొకేట్ దేవదత్ కామత్ పేర్కొన్నారు. కర్ణాటకతో పాటు దేశాన్ని కుదిపేసిన హిజాబ్ అంశంపై హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా ఆయన వాదనలు వినిపించారు. దక్షిణ భారతదేశానికి చెందిన హిందూ బాలిక ముక్కుపుడుక ధరించే పాఠశాలలకు వస్తుందని అన్నారు. ఈ కేసు యూనిఫాంకు సంబంధించినది కాదని, యూనిఫాం ధరించడానికి మినహాయింపులకు సంబంధించిందని కోర్టుకు విన్నవించారు. ఈ సందర్భంగా దక్షిణాఫ్రికా న్యాయస్థానం వెలువరించిన తీర్పును ప్రస్తావించారు.
karnataka hijab row high court
"కొంత మంది విద్యార్థులు మతాచారాలను పాటించడం వల్ల స్కూళ్లలో ఉండే ఇతర పిల్లలు తమ సంస్కృతిని పాటించేలా ప్రోత్సహించినట్లు అవుతుంది. దీని వల్ల భయపడాల్సిన అవసరం లేదు. బహిరంగ ప్రదేశాల్లో మతాచారాలను ప్రదర్శించడం ఆందోళకరమైన విషయం కాదు. దీని వల్ల దేశ వైవిధ్యాన్ని చాటి చెప్పినట్లు అవుతుంది. మన రాజ్యాంగం సునిశితమైన లౌకికవాదాన్ని పాటిస్తుంది. టర్కీ లౌకికవాదం మాదిరిగా కాదు. టర్కీలో నెగెటివ్ లౌకికవాదం ఉంది. మన లౌకికవాదం ప్రతి ఒక్కరి మతపరమైన హక్కులు కాపాడుతుంది."
-దేవదత్ కామత్, పిటిషనర్ తరఫు న్యాయవాది
విద్యాసంస్థల్లో యూనిఫాం తప్పనిసరి చేస్తూ.. హిజాబ్ ధరించిన విద్యార్థినులను అనుమతించకపోవడాన్ని సవాల్ చేస్తూ ఈ పిటిషన్ దాఖలైంది.
ఈ అంశంపై హైకోర్టులో సోమవారం సైతం విచారణ జరిగింది. హిజాబ్‌పై ప్రభుత్వం జారీ చేసిన జీఓ ఆర్టికల్ 25 ప్రకారం చెల్లదని సీనియర్ అడ్వొకేట్ దేవదత్ కామత్ వాదించారు. హిజాబ్‌ను ధరించాలా వద్దా అనే విషయాన్ని కాలేజీ కమిటీలు నిర్ణయించడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. కేంద్రీయ విద్యాలయాల్లోనూ హిజాబ్‌ను అనుమతిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఇదీ చదవండి: 87ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం.. 16 గంటల్లోనే నిందితుడు అరెస్ట్