ETV Bharat / bharat

రేప్ కేసులో నిందితుడికి ఊరట- బాధితురాలు అలా చేయడమే కారణం - రేపు కేసు బెయిల్​

రేప్​ కేసులో నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది కర్ణాటక హైకోర్టు. బాధిత మహిళ కావాలనే అతనికి నగ్నంగా వీడియో కాల్స్ చేసిందని గుర్తించి ఈ నిర్ణయం తీసుకుంది(karnataka high court news).

Karnataka High Court, కర్ణాటక హై కోర్టు
రేప్ కేసులో నిందితుడికి బెయిల్
author img

By

Published : Nov 26, 2021, 2:31 PM IST

ఓ రేప్​ కేసులో నిందితుడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కర్ణాటక హైకోర్టు. బాధిత మహిళ కావాలనే నిందితుడితో నగ్నంగా ఫోన్లో మాట్లాడిందని, పరస్పర అంగీకారంతోనే శారీరక సంబంధం ఏర్పరుచుకున్నారని గుర్తించినందు వల్ల ఈ నిర్ణయం తీసుకుంది(karnataka high court news).

కొప్పల్​కు చెందిన బసనగౌడ తనను రేప్ చేశాడని, తన నగ్న చిత్రాలను భర్తకు పంపాడని ఓ వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే అతడ్ని వారు అరెస్టు చేశారు. అత్యాచారం అభియోగాలు మోపారు. దీన్ని సవాల్ చేస్తూ నిందితుడు హైకోర్టును ఆశ్రయించగా.. అతనికి ఊరట లభించింది(bail to rape accused).

"ఇద్దరూ పరస్పర అంగీకారంతోనే శృంగారంలో పాల్గొన్నారు. బాధిత మహిళకు పెళ్లికి ముందే నిందితునితో శారీరక సంబంధం ఉంది. ఆమె తన భర్త ఫోన్ నుంచి తెల్లవారుజామున 4, 5 గంటల సమయంలో నిందితుడికి చాలా సార్లు ఫోన్ చేసింది. నగ్నంగా వీడియో కాల్​ మాట్లాడింది. ఇవన్నీ పరిశీలిస్తే ఈమె నిందితుడితో శారీరక సంబంధం ఇష్టపూర్వకంగానే పెట్టుకున్నట్లనిపిస్తోంది. ఫోన్లోనూ కావాలనే నగ్నంగా కన్పించినట్లు అర్థమవుతోంది. నిందితుడికి జీవిత ఖైదు విధించేంత అభియోగాలు ఏమీ లేవు. అతనికి నేర చరిత్ర కూడా లేదు. ఎలక్ట్రానిక్ రూపంలో నగ్న చిత్రాలు పంపినందుకు అతనిపై ఐటీ చట్టంలోని సెక్షన్ 67 కింద కేసు నమోదైంది. ఇలాంటి సందర్భంలో నిందితునికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.5లక్షల జరిమానా విధించవచ్చు." అని ధర్మాసనం వ్యాఖ్యానించింది(karnataka rape Accused bail).

నిందితుడికి బెయిల్ మంజూరైతే బాధితురాలికి ప్రాణహాని ఉందనే ఆరోపణపై అభ్యంతరం తెలిపింది కోర్టు. బాధితురాలు శారీరక సంబంధానికి అంగీకారం తెలిపి, మొబైల్‌లో తన ప్రైవేటు శరీర భాగాలను చూపించిన పరిస్థితుల్లో ఆమెకు ప్రాణహాని ఉంటుందా? లేదా? అనే విషయాన్ని దిగువ కోర్టులు నిర్ణయించాలని సూచించింది.(karnataka rape Accused bail news)

ఇద్దరూ బంధువులే..

రేప్ కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు, బాధితురాలు బంధువులు. ఒకే గ్రామానికి చెందినవారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. కానీ ఆ తర్వాత ఆ మహిళకు వేరే వ్యక్తితో పెళ్లి జరిగింది. వివాహం జరిగాక కూడా ఇద్దరూ శారీరక సంబంధం కొనసాగించారు. తనకు నగ్నంగా వీడియో కాల్​ చేసి మాట్లాడమని నిందితుడు బాధితురాలిని డిమాండ్ చేశాడు. అందుకు ఆమె అంగీకరించింది. అతడు చెప్పినట్టే చేసింది. అయితే ఆమె నగ్నంగా కాల్ చేసినప్పుడు అతడు ఫోన్లో స్క్రీన్ షాట్లు తీసుకున్నాడు(karnataka rape case news).

15 రోజుల పాటు బాధితురాలు నిందితుడికి ఫోన్​ చేయలేదు. దీంతో అతడు ఏప్రిల్ 5న ఆమె నగ్న ఫొటోలను భర్తకు ఫోన్లో పంపాడు. వాటిని చూసి అతడు భార్యతో గొడవ పడి పుట్టింటికి వెళ్లగొట్టాడు(rape case bail).

ఆ మరునాడే బాధిత మహిళ ఫోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు తనను రేప్​ చేశాడని, తనకు ప్రాణహాని ఉందని చెప్పింది. మరుసటి రోజే పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి: మైసూర్ ప్యాలెస్​కు 'లీకేజీ' కష్టాలు- రాజకుటుంబీకుల అసహనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.