ETV Bharat / bharat

ఈ ఏడాది నుంచే రైతుల పిల్లలకు స్కాలర్​షిప్​! - కర్ణాటక ప్రభుత్వం

ప్రత్యేకంగా రైతుల పిల్లల కోసం రూపొందించిన ఉపకార వేతన(స్కాలర్‌షిప్​) పథకాన్ని ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది కర్ణాటక ప్రభుత్వం. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన బసవరాజ్ బొమ్మై.. తొలి కేబినెట్​ సమావేశంలోనే రైతుల పిల్లల ఉన్నత విద్య కోసం ఈ పథకాన్ని ప్రకటించారు. ఇందుకోసం రూ.1,000 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

scholarships for farmer's kids
రైతు పిల్లలకు ఉపకార వేతనాలు
author img

By

Published : Aug 8, 2021, 10:59 AM IST

కర్ణాటకలో రైతుల పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఉపకార వేతనాల పథకాన్ని ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ప్రారంభించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై.. తాను బాధ్యతలు చేపట్టిన అనంతరం నిర్వహించిన మొదటి మంత్రివర్గ సమావేశంలోనే రైతుల పిల్లల ఉన్నత విద్య కోసం ఈ పథకాన్ని ప్రకటించారు. ఇందుకోసం రూ.1000 కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. ఉపకార వేతనాలు ప్రతి సంవత్సరం అర్హులైన విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ అవుతాయి. పదో తరగతి పూర్తి చేసి.. పీయూసీ, ఐటీఐ కోర్సులు చదివే అబ్బాయిలకు సంవత్సరానికి రూ.2,500, అమ్మాయిలకు రూ.3 వేలు అందజేస్తారు. ఎంబీబీఎస్‌, బీటెక్, డిగ్రీ, చదివే యువకులకు రూ.5,000, యువతులకు 5,500 రూపాయలు అందిస్తారు. పీజీ చదివే యువకులకు 10 వేలను, యువతులకు 11 వేలను కేటాయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇదీ చూడండి: రైతులకు శుభవార్త.. సోమవారమే ఖాతాల్లోకి డబ్బులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.