ETV Bharat / bharat

3నెలల తర్వాత చిన్నారి చెంతకు 'తల్లి జ్ఞాపకాలు'

కరోనా.. ఆ చిన్నారి తల్లిని బలిదీసుకుంది. అమ్మతో గడిపిన క్షణాలు కూడా ఫోన్​ రూపంలో దూరమై మరింత క్షోభ పెట్టాయి. ఇన్ని రోజులూ తల్లిని మనసులోనే దాచుకున్న ఆ బాలిక పెదవులపై చిరునవ్వు తీసుకొచ్చారు కర్ణాటక పోలీసులు. ఎట్టకేలకు పోగొట్టుకున్న తల్లి మొబైల్ ఫోన్​ను ఆమెకు అందించారు.

Girl found her dead mother's mobile phone
చిన్నారి లేఖ
author img

By

Published : Aug 20, 2021, 7:32 PM IST

Updated : Aug 20, 2021, 10:36 PM IST

'ఫోన్​లో అమ్మ జ్ఞాపకాలు.. ఎలాగైనా తెచ్చివ్వండి' అంటూ మూడు నెలల క్రితం వేడుకున్న చిన్నారి ఎదురుచూపులు ఫలించాయి. కరోనాతో మరణించిన ఆమె తల్లి మొబైల్​ ఫోన్​ను గుర్తించారు పోలీసులు. దీంతో అమ్మే తన చెంత చేరువైందనే ఆనందంలో తేలుతోంది ఆ బాలిక.

Girl found her dead mother's mobile phone
చిన్నారి లేఖ

ఏం జరిగిందంటే..

"కరోనాతో మే 16న మడికేరి ఆస్పత్రిలో మా అమ్మ చనిపోయింది. తన వద్ద ఉన్న ఫోన్​ను ఎవరో ఎత్తుకెళ్లారు. మా అమ్మ జ్ఞాపకాలు అందులో ఉన్నాయి. దానిని ఎవరైనా తీసుకున్నా.. దొరికినా.. దయచేసి ఈ అనాథకు ఇవ్వండి," అంటూ ఈ ఏడాది మేలో కొడగు పాలనాధికారి, పోలీసులకు లేఖ రాసింది జిల్లాకు చెందిన హృతీక్ష.

తల్లి ఫొటోతో చిన్నారి, ఆమె తండ్రి

తన తల్లి జ్ఞాపకాలకున్న ఏకైక ఆధారం ఆ ఫోనే అని చిన్నారి ఆవేదన వ్యక్తంచేసింది. ఈ లేఖపై స్పందించిన జిల్లా కలెక్టర్​ వీలైనంత త్వరగా ఆ ఫోన్​ను గుర్తించి చిన్నారికి అప్పగిస్తామని ఆ సమయంలో హామీఇచ్చారు.

బాలికకు ఫోన్ అందిస్తున్న పోలీసులు

జిల్లా యంత్రాంగం ఆదేశాల మేరకు ముమ్మరంగా గాలించారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే ఆస్పత్రి స్టోర్​ రూమ్​ శుభ్రం చేస్తున్న సమయంలో సిబ్బందికి ఫోన్ కనిపించింది. దానిని వారు పోలీసులకు అందించారు. దీంతో చిన్నారిని స్టేషన్​కు పిలిపించిన పోలీసులు.. ఫోన్​ను తనకు ఇచ్చేశారు.

దీంతో పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది బాలిక.

ఫోన్​ దొరికిన ఆనందంలో హృతీక్ష

"మా అమ్మ ఫొటోలు ఉన్న ఫోన్​ దొరికింది. దీని కోసం ఎంతగానో ఎదురుచూశాను. చాలా సంతోషంగా ఉంది. పోలీసులకు ధన్యవాదాలు. నాకు కచ్చితంగా తెలుసు ఫోన్ దొరుకుతుందని. అదే నమ్మకంతో ఉన్నా. కానీ మా నాన్నే ఫోన్​పై ఆశలు వదిలేసుకున్నారు."

-హృతీక్ష, బాలిక

కాగా, చివరకు ఫోన్​ దొరకడం ఆనందాన్నిచ్చిందని చిన్నారి చెప్పింది.

ఇదీ చూడండి: ఒక్క లేఖతో చిన్నారి కుటుంబంలో 'దీపావళి' వెలుగులు

Last Updated : Aug 20, 2021, 10:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.