కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. రాష్ట్రంలోని 224 స్థానాల్లో 136 సీట్లను కైవసం చేసుకుని కాంగ్రెస్ అధికారం చేపట్టేందుకు సిద్ధమైంది. మరోవైపు.. బీజేపీ 65 స్థానాలకే పరిమితమైంది. జేడీఎస్ 19, ఇతరులు నాలుగు చోట్ల గెలుపొందారు. 2018 ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ అదనంగా 56 స్థానాలు సంపాదించింది. అదే అధికార బీజేపీ.. 39 స్థానాలు కోల్పోయింది. జేడీఎస్ సైతం 2018 ఎన్నికలతో పోలిస్తే 18 సీట్లు కోల్పోయింది.
మొత్తం సీట్లు | 224 |
కాంగ్రెస్ | 136 |
బీజేపీ | 65 |
జేడీఎస్ | 19 |
ఇతరులు | 4 |
- బెంగళూరు ప్రాంతం(28): బీజేపీ -15, కాంగ్రెస్-13, జేడీఎస్-0
- మధ్య కర్ణాటక (25): కాంగ్రెస్-19, బీజేపీ -5, జేడీఎస్-1
- కోస్తా కర్ణాటక (19): బీజేపీ -13, కాంగ్రెస్-6, జేడీఎస్-0
- హైదరాబాద్ కర్ణాటక (41) : కాంగ్రెస్-26, బీజేపీ -10, జేడీఎస్-3
- బాంబే కర్ణాటక(50) : కాంగ్రెస్-33, బీజేపీ -16, జేడీఎస్-1
- మైసూరు ప్రాంతం(61): కాంగ్రెస్-39, బీజేపీ -6, జేడీఎస్-14
- మధ్య కర్ణాటక, హైదరాబాద్ కర్ణాటకలో సత్తా చాటిన కాంగ్రెస్
- మైసూరు, బాంబే కర్ణాటక ప్రాంతాల్లో సత్తా చాటిన కాంగ్రెస్
- ఓడినా బెంగళూరు, కోస్తా కర్ణాటకలో పట్టు నిలుపుకున్న బీజేపీ
- కర్ణాటక ఫలితాల్లో జేడీఎస్‌కు ఊహించని పరాభవం
- మైసూరు మినహా ఎక్కడా కనిపించని జేడీఎస్ ప్రభావం
- 2018తో పోలిస్తే 5 శాతం అదనపు ఓట్లు సాధించిన కాంగ్రెస్
- 5 శాతం అదనపు ఓట్లతో 56 స్థానాలు అదనంగా సాధించిన కాంగ్రెస్
- 2018 ఎన్నికలతో పోలిస్తే 5 శాతం ఓట్లు కోల్పోయిన జేడీఎస్
- 5 శాతం ఓట్ల నష్టంతో 18 స్థానాలు కోల్పోయిన జేడీఎస్
- ఓట్ల శాతంలో పెద్దగా తేడా లేకున్నా అధికారం కోల్పోయిన బీజేపీ
- 0.65 శాతం ఓట్ల నష్టంతో 39 స్థానాలు కోల్పోయిన బీజేపీ