ETV Bharat / bharat

ఎన్నికల ప్రచారానికి మాజీ సీఎం కుమారస్వామి దూరం!.. ఏం జరిగింది? - హెచడీ కుమారస్వామి

జేడీఎస్‌ అగ్రనేత, మాజీ సీఎం హెచ్​డీ కుమారస్వామి అస్వస్థతకు గురయ్యారు. శనివారం సాయంత్రం ఆయన ఆస్పత్రిలో చేరారు. దీంతో కొన్నిరోజుల పాటు పార్టీ ప్రచార కార్యక్రమాలకు ఆయన దూరం కానున్నారు.

karnataka-election-2023-h-d-kumaraswamy-admitted-to-hospital-following-fever
ఆసుపత్రిలో చేరిన కుమార స్వామి
author img

By

Published : Apr 23, 2023, 12:13 PM IST

Updated : Apr 23, 2023, 1:31 PM IST

జేడీఎస్‌ పార్టీ అగ్రనేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్​డీ కుమారస్వామి అనారోగ్యానికి గురయ్యారు. దీంతో శనివారం సాయంత్రం ఆయన ఆసుపత్రిలో చేరారు. బెంగళూరు పాత విమానాశ్రయానికి సమీపంలో ఉన్న మణిపాల్‌ ఆస్పత్రిలో కుమారస్వామి చేరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో ఆయన ఎన్నికల ప్రచారానికి కొన్ని రోజులపాటు దూరం కానున్నారు.

అలసట, సాధారణ బలహీనతతో కుమారస్వామి ఆస్పత్రిలో చేరినట్లు ఆయనకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రి వైద్యులు తెలిపారు. అవసరమైన అన్ని పరీక్షలు చేసినట్లు వారు వెల్లడించారు. ప్రస్తుతం కుమారస్వామి ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఆయన వేగంగా కోలుకుంటున్నట్లు తెలిపారు. విరామం లేకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొనటమే అనారోగ్యానికి కారణమని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కుమారస్వామి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు.. జేడీఎస్‌ వర్గాలు తెలిపాయి. తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందవద్దని పార్టీ శ్రేణులకు కుమారస్వామి సూచించారు.

వైద్యులు సూచన మేరకు ఆదివారం.. కుమార స్వామి విశ్రాంతి తీసుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. సోమవారం కూడా ఆయన విశ్రాంతి తీసుకుంటారని వర్గాలు వెల్లడించాయి. ఆయన తిరిగి మంగళవారం నుంచి ప్రచారంలో పాల్గొంటారని పేర్కొన్నాయి. కాగా కర్ణాటకలో అధికార పీఠాన్ని చేజిక్కుంచుకోవడమే లక్ష్యంగా కుమారస్వామి ప్రచారం నిర్వహిస్తున్నారు. పంచరత్న రథయాత్ర పేరుతో రాష్ట్రంలో ప్రచారం చేస్తున్నారు. అధికారంలోకి వస్తే పంచరత్న పథకాలను అమలు చేస్తానని కర్ణాటక ప్రజలకు కుమారస్వామి హామీ ఇస్తున్నారు. మొత్తం 123 స్థానాల్లో గెలవడమే లక్ష్యంగా.. జేడీఎస్​ అగ్రనేత ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

జాతీయ పార్టీల అసంతృప్తులను అక్కున చేర్చుకున్న జేడీఎస్​..
అయితే ఈ సారి కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్​ గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది. కేవలం పాత మైసూర్​కే పరిమితమైన ఆ పార్టీ.. ప్రస్తుత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా బలమైన అభ్యర్ధులను బరిలోకి దింపింది. వివిధ కారణాలతో భాజపా, కాంగ్రెస్‌ పార్టీలో టికెట్ల నిరాకరణకు గురై వారిని అక్కున చేర్చుకుంది. వారి అలకలు, అసంతృప్తులు ఆసరాగా చేసుకుని జేడీఎస్​ నుంచి టికెట్లు కేటాయించింది. జాతీయ పార్టీల నుంచి అసమ్మత్తులు బయటకు వస్తారని ముందే గ్రహించిన కుమారస్వామి.. వారి కోసం వివిధ స్థానాల నుంచి బీ ఫారాలు సిద్ధంగా ఉంచారు. వారి బలాల ఆధారంగా టికెట్ల కేటాయించారు. వేరే పార్టీలో నుంచి వచ్చిన వారిని సర్దుబాటు చేసేందుకు.. తాము అప్పటికే ప్రకటించిన అభ్యర్థులను సైతం మార్చేయటానికి కుమారస్వామి వెనుకాడలేదు. అలా మొత్తం 22 మంది వలస నేతలకు టికెట్లు ఇచ్చిన కుమారస్వామి.. 12 మంది కోసం అప్పటికే ప్రకటించిన అభ్యర్థులను మార్చారు. జేడీఎస్​లో చేరిన వారిలో అత్యధికులు బీజేపీ వారు ఉండటం గమనార్హం. దీంతో జేడీఎస్​ మునుపటి కన్నా ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం కూడా లేకపోలేదని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Last Updated : Apr 23, 2023, 1:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.