మనం దేవుడ్ని భక్తిశ్రద్దలతో పూజ చేయడంలో తప్పు లేదు. కానీ ఆ ధ్యాసలో పడి ప్రపంచాన్నే మర్చిపోకూడదు. అలా చేసిన ఓ భక్తుడు.. చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి.. పూజ ధ్యాసలో మునిగిపోయి తీర్థంతోపాటు బాలకృష్ణుడి విగ్రహాన్ని మింగేశాడు. ఆ వ్యక్తి గొంతులో ఇరుక్కున్న విగ్రహాన్ని డాక్టర్లు ఎంతో కష్టపడి ఆపరేషన్ చేసి బయటకు తీశారు.
ఇదీ జరిగింది.. బెళగావికి చెందిన ఓ 45 ఏళ్ల వ్యక్తి రోజూ తన ఆరాధ్య దైవం బాలకృష్ణుడ్ని పూజించేవాడు. అయితే.. ఓరోజు అనుకోకుండా తీర్థం తీసుకునేటప్పుడు పంచామృతంలో ఉన్న బాలకృష్ణుడి విగ్రహాన్ని మింగేశాడు. దాని గురించి అతడికి కూడా తెలియదు. గొంతులో విపరీతమైన నొప్పి, వాపు రావడం వల్ల అనుమానం వచ్చి స్థానిక వైద్యుల వద్దకు వెళ్లాడు. ఎక్స్‌రే చేసి చూడగా గొంతులో కృష్ణుడి విగ్రహం ఇరుక్కుపోయిందని తేల్చారు వైద్యులు.
ఇవీ చదవండి: అనుమానాస్పదంగా జింకల కళేబరాలు.. సోలార్ కంపెనీ పనేనా?
Gujarat riots 2002: మోదీకి క్లీన్ చిట్‌ను సమర్థించిన సుప్రీంకోర్టు