ETV Bharat / bharat

సీఎం భద్రతా సిబ్బంది డ్రగ్స్ దందా- ఇద్దరు అరెస్ట్

Karnataka CM security: గంజాయి విక్రయిస్తున్న ఆరోపణతో కర్ణాటక సీఎం బసవరాజ్​​ బొమ్మై నివాసం వద్ద సెక్యూరిటీగా పని చేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లను అధికారులు అరెస్టు చేశారు. మరోవైపు తమిళనాడులో 170 కిలోల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

CM Bommai security
CM Bommai security
author img

By

Published : Jan 18, 2022, 10:57 PM IST

Karnataka CM security: బెంగళూరులో డ్రగ్స్ రాకెట్​ నడుపుతున్న కర్ణాటక సీఎం బసవరాజ్​ బొమ్మై భద్రతా సిబ్బందిని అధికారులు అరెస్ట్ చేశారు. గంజాయి విక్రయిస్తున్న ఆరోపణలతో సీఎం నివాసంలో పని చేస్తున్న ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కోరమంగళ పోలీస్​ స్టేషన్‌ పరిధిలోని శివకుమార్​,సంతోష్​లుగా గుర్తించారు. వీరిద్దరూ ఆర్‌టీ నగర్​లోని సీఎం బొమ్మై నివాసం వద్ద భద్రతా సిబ్బందిగా విధులు నిర్వహిస్తున్నారు.

నిందితులు.. మాదకద్రవ్యాల వ్యాపారుల నుంచి డ్రగ్స్​ తీసుకుని కస్టమర్లకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు సీఎం నివాసం సమీపంలోని డన్జో ద్వారా డ్రగ్స్‌ సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. మాదకద్రవ్యాలు అందుకుంటున్న సమయంలో డబ్బుల విషయమై డ్రగ్స్ వ్యాపారులతో వాగ్వాదం జరిగిందని.. అనుమానంతో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అప్పటికే వారికి గంజాయి పార్శిల్ అందినట్లు వెల్లడించారు.

అరెస్టు చేసే సమయంలో కానిస్టేబుళ్లు సాధారణ దుస్తుల్లో ఉన్నారని.. మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ వ్యాపారులు అమ్​జద్ ఖాన్, అఖిల్ రాజ్​ నుంచి డ్రగ్స్​ కొనుగోలు చేసినట్లు విచారణలో నిందితులు అంగీకరించినట్లు తెలిపారు. ఇద్దరు డ్రగ్స్‌ వ్యాపారులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

170 కిలోల గంజాయి పట్టివేత

తమిళనాడు నుంచి శ్రీలంకకు అక్రమంగా తరలిస్తున్న 170 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. నాగపట్టణం జిల్లాలోని వేదారణ్యం సమీపంలోని గంజాయి చేతులు మారుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. పక్కా ప్లాన్​తో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: కాంగ్రెస్​ లేకుండా శివసేన-ఎన్సీపీ రాజకీయం.. అసలేమైంది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.