కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప మరోసారి కరోనా బారినపడ్డారు. గతేడాది ఆగస్టు 2న కూడా ఆయనకు కొవిడ్ సోకింది. అనంతరం కోలుకున్నారు.
ఇప్పుడు రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న యడియూరప్పకు ఈ ఉదయం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది.
" స్వల్ప జ్వరం ఉండటం వల్ల.. నేను ఈరోజు కరోనా పరీక్ష చేయించుకున్నాను. నాకు పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ప్రస్తుతం నేను బాగానే ఉన్నా.. వైద్యుల సలహాతో ఆసుపత్రిలో చేరాను. ఇటీవల నన్ను సంప్రదించిన వారు పరీక్షలు చేయించుకోండి."
-- యడియూరప్ప, కర్ణాటక ముఖ్యమంత్రి
శుక్రవారం ఉదయం రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై అధికారులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసిన యడియూరప్ప, అనంతరం కరోనా పరీక్షలకు హాజరయ్యారు. ప్రస్తుతం ఆయన రామయ్య స్మారక ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి.. మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి : జూన్ నాటికి రోజుకు 2,320 కరోనా మరణాలు!