కర్ణాటకలో మే 10 నుంచి 24 వరకు సంపూర్ణ లాక్డౌన్ విధిస్తున్నట్లు సీఎం యడియూరప్ప ప్రకటించారు. కర్ఫ్యూ అమల్లో ఉన్నా కేసులు పెరుగుతున్నందు వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. లౌక్డౌన్ పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఉదయం 10గంటల తర్వాత రోడ్డుపై ఒక్కరికి కూడా అనుమతి లేదని తేల్చి చెప్పారు.
కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నందు వల్లే లాక్డౌన్ నిర్ణయం తీసుకున్నట్లు యడియూరప్ప వివరించారు. ఇది తాత్కాలిక నిర్ణయమేనని, వలస కూలీలు రాష్ట్రాన్ని వీడొద్దని సూచించారు.