ETV Bharat / bharat

మందుబాబులకు బిగ్​ షాక్​.. భారీగా మద్యం రేట్లు పెంపు.. ఎంతంటే? - Karnataka news

Liquor Price Hike In Karnataka : మద్యం ప్రియులకు కర్ణాటక ప్రభుత్వం షాక్​ ఇచ్చింది. లిక్కర్​పై ఎక్సైజ్ డ్యూటీని 20 శాతం పెంచింది. దీంతో ఆ రాష్ట్రంలో మద్యం భారీగా ధరలు పెరగనున్నాయి.

Liquor Price Hike In Karnataka :
Liquor Price Hike In Karnataka :
author img

By

Published : Jul 7, 2023, 4:08 PM IST

Updated : Jul 7, 2023, 4:47 PM IST

Karnataka Budget 2023 : కర్ణాటకలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తొలి బడ్జెట్​ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఎన్నికల హామీల అమలుకు ఖజానాపై భారీ స్థాయిలో భారం పడనున్న పరిస్థితుల్లో.. ఆదాయం పెంచుకునే దిశగా ఈ బడ్జెట్​లో కాంగ్రెస్​ ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. శుక్రవారం సభలో బడ్జెట్​ను ప్రవేశపెట్టిన.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. ప్రధానంగా ఆదాయ పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

మందుబాబులకు షాక్​
Liquor Price Hike In Karnataka : బడ్జెట్​లో భాగంగా ఇండియన్ మేడ్ లిక్కర్​పై ఎక్సైజ్ డ్యూటీని కర్ణాటక​ ప్రభుత్వం 20 శాతం పెంచింది. బీర్ల అమ్మకాలపై ఎక్సైజ్ సుంకాన్ని 10 శాతం పెంచింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మద్యం ధరలు భారీగా పెరగనున్నాయి. మొత్తం 18 స్లాబ్​ల్లో అదనంగా 20 శాతం ఎక్సైజ్ డ్యూటీ పెరగనుంది. ఈ పెంపు తరువాత కూడా కర్ణాటకలో లిక్కర్ ధరలు పొరుగు రాష్ట్రాల కన్నా తక్కువగానే ఉంటాయని సిద్ధరామయ్య తెలిపారు.

అత్యధికంగా విద్యారంగానికే..
కర్ణాటక బడ్జెట్ మొత్తం వ్యయం 3,27,747 కోట్ల రూపాయలుగా సిద్ధరామయ్య ప్రభుత్వం అంచనా వేసింది. అత్యధికంగా విద్యారంగానికి రూ.37,587 కోట్లను కేటాయించింది. మహిళా- శిశు సంక్షేమానికి రెండో ప్రాధాన్యం ఇచ్చింది. దీనికి రూ.24,166 కోట్లను ఈ వార్షిక బడ్జెట్‌లో ప్రతిపాదించింది. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమానికి 14,950 కోట్ల రూపాయలను మంజూరు చేసింది.

  • Karnataka budget | CM Siddaramaiah presents State Budget - Total Expenditure is estimated to be Rs 3,27,747 crores which includes Revenue Expenditure at Rs 2,50,933 crores, Capital Expenditure at Rs 54,374 crores and loan repayment at Rs 22,441 crores. pic.twitter.com/KjzkryBojU

    — ANI (@ANI) July 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఐదు ఉచిత హామీలకు రూ.52వేల కోట్లు!
ఎన్నికల్లో ఇచ్చిన అయిదు ఉచిత పథకాలను అమలు చేయడానికి ప్రత్యేకంగా 52,000 కోట్ల రూపాయలను కేటాయించింది సిద్ధరామయ్య ప్రభుత్వం. ఈ ఐదు ఉచిత పథకాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా కోటి 30 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతాయని ప్రభుత్వం అంచనా వేసింది.

పికప్​ వ్యాన్ల కోసం వడ్డీ లేని రుణాలు
గతంలో బీజేపీ ప్రభుత్వం వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్ (ఏపీఎంసీ) చట్టంలో చేసిన సవరణలను ఉపసంహరిస్తున్నట్లు సిద్ధరామయ్య ప్రకటించారు. శివమొగ్గ, హసన్, దక్షిణ కన్నడ, కొడగు, ఉత్తర కన్నడ, ఉడుపి జిల్లాల్లో వ్యవసాయోత్పత్తులను రవాణా చేయడానికి పికప్ వ్యాన్లను కొనుగోలు చేయడానికి ఏడు లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాన్ని అందజేస్తామని చెప్పారు.

సిద్ధరామయ్య కొత్త రికార్డు
సిద్ధరామయ్య.. ఇప్పటివరకు 14 సార్లు బడ్జెట్​ను​ ప్రవేశపెట్టారు. దీంతో రాష్ట్ర చరిత్రలో ఎక్కువ సార్లు బడ్జెట్​ ప్రవేశపెట్టిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. 13సార్లు బడ్జెట్​ ప్రవేశపెట్టిన మాజీ సీఎం దివంగత రామకృష్ణ హెగ్డే పేరు మీద ఉన్న రికార్డును ఆయన బద్దలుగొట్టారు.

liquor price hike in karnataka
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

Karnataka Election Results : మే నెలలో జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 224 స్థానాలు అసెంబ్లీ స్థానాలకుగాను కాంగ్రెస్‌ పార్టీ 135 నియోజకవర్గాల్లో జయకేతనం ఎగురవేసింది. భారతీయ జనతా పార్టీ 66 సీట్లు, మాజీ ప్రధాని దేవెగౌడ సారథ్యంలోని జేడీఎస్‌ 19 స్థానాలు గెలుపొందాయి.

మే 20వ తేదీన సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌తో పాటు మరో ఎనిమిది మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం మే 27న మరో 24 మందితో కేబినెట్‌ను విస్తరించారు. ఊహాగానాలకు అనుగుణంగానే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆర్థిక శాఖను తన వద్దే ఉంచుకున్నారు. పార్టీ ప్రయోజనాల కోసం సీఎం పదవిని త్యాగం చేసి.. డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన డీకే శివకుమార్‌కు నీటిపారుదలతో పాటు, బెంగళూరు నగర అభివృద్ధి శాఖలను అప్పగించారు.

Last Updated : Jul 7, 2023, 4:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.