Karnataka Bank Jobs 2023 : దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న తమ శాఖల్లో ఖాళీల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది కర్ణాటక బ్యాంక్( Karnataka Bank Recruitment 2023 ). మొత్తం 341 పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈనెల 12నే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా.. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 26 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
మొత్తం ఖాళీలు..
Karnataka Bank Post : 341 పోస్టులు
ఈ పోస్టులు..
Karnataka Bank Notification 2023 : ప్రొబేషనరీ ఆఫీసర్, స్పెషలిస్ట్ ఆఫీసర్, మేనేజర్, క్లర్క్, ఆఫీస్ అసిస్టెంట్ సహా ఇతర పోస్టులు ఉన్నాయి.
ఏజ్ లిమిట్(ఆగస్టు 1 నాటికి)..
⦁ అన్రిజర్వ్డ్- 28 ఏళ్లు
⦁ ఎస్సీ- 33 ఏళ్ల్లు
⦁ ఎస్టీ- 33 ఏళ్లు
విద్యార్హతలు..
⦁ ఏదైనా డిగ్రీ లేదా పీజీ
⦁ బీటెక్, ఎంటెక్, ఎంసీఏ చేసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు రుసుము..
⦁ జనరల్- రూ.800/-
⦁ ఎస్సీ, ఎస్టీ- రూ.700/-
ఎంపిక విధానం..
⦁ ఆన్లైన్ టెస్టు
⦁ ఇంటర్వ్యూ
⦁ ఈ రెండిటిలో అర్హత సాధించిన అభ్యర్థులు మంగళూరులోని బ్యాంక్స్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో 'Induction Training Programme'లో పాల్గొనాల్సి ఉంటుంది.
దరఖాస్తు చివరితేదీ..
Karnataka Bank PO Last Date : 2023 ఆగస్టు 26
పరీక్ష తేదీ..
Karnataka Bank PO Exam : 2023 సెప్టెంబర్(అంచనా)
పరీక్ష కేంద్రాలు..
Karnataka Bank PO Exam Centers : హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబయి, మైసూరు, దిల్లీ సహా దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో ఆన్లైన్ పరీక్షను నిర్వహిస్తారు.
వేతనాలు..
Karnataka Bank PO Salary : నిబంధనల ప్రకారం పైన తెలిపిన పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.లక్ష వేతనాన్ని చెల్లిస్తారు.
జాబ్ లొకేషన్..
Karnataka Bank PO Job Location : ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న కర్ణాటక బ్యాంకు శాఖల్లో పనిచేయాల్సి ఉంటుంది.
బ్యాంకు వెబ్సైట్..
Karnataka Bank Website : కేటగిరీల వారిగా వయోపరిమితి సడలింపులు, పరీక్షా సిలబస్, ఎగ్జామ్ పాటర్న్ సహా ఇతర సందేహాల నివృత్తి కోసం బ్యాంకు అధికారిక వెబ్సైట్ www.karnatakabank.com ను చూడొచ్చు.
నేడే లాస్ట్‌డేట్..
NSUT Faculty Recruitment 2023 : మరోవైపు, అధ్యాపక వృత్తిలో స్థిరపడాలనుకునే వారి నుంచి దిల్లీలోని నేతాజీ సుభాష్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (NSUT) దరఖాస్తులు స్వీకరిస్తోంది. మొత్తం 322 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుకు ఈ రోజే(ఆగస్టు 17) ఆఖరు తేదీగా నిర్ణయించారు. కాగా, ఆసక్తి గల అభ్యర్థులు ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
DRDO Jobs Notification 2023 : DRDOలో సైంటిస్ట్ జాబ్స్.. రూ.లక్షకుపైనే జీతం.. బీటెక్ చేస్తే చాలు!
Engineering Jobs 2023 : ఐటీఐ, ఇంజినీరింగ్ అర్హతతో.. 531 నాన్-ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు!
Engineering Jobs 2023 : ఐటీఐ, డిప్లొమా అర్హతతో.. 1191 అప్రెంటీస్ పోస్టులు.. దరఖాస్తు చేసుకోండిలా!
Bank Jobs 2023 : బ్యాంక్ క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. దరఖాస్తు చేసుకోండిలా!