ETV Bharat / bharat

కర్ణాటకలో హంగ్.. కింగ్ మేకర్​గా జేడీఎస్.. ఆసక్తికరంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు

Karnataka Election Exit polls 2023 : కర్ణాటక ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చనే లెక్కలు వెలువరించాయి ఎగ్జిట్ పోల్స్. రాష్ట్రంలో హంగ్ తప్పదని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఈ సర్వేల ప్రకారం.. ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయంటే?

karnataka-assembly-election-2023
karnataka-assembly-election-2023
author img

By

Published : May 10, 2023, 6:45 PM IST

Updated : May 10, 2023, 6:56 PM IST

Karnataka Assembly Election 2023 : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం లేదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని పలు సర్వేలు చెబుతున్నాయి. రెండో స్థానంలో బీజేపీ, మూడో స్థానంలో జేడీఎస్ నిలుస్తాయని పేర్కొన్నాయి. కాంగ్రెస్​కు 94 నుంచి 108 మధ్య సీట్లు వస్తాయని 'రిపబ్లిక్ పీ-మార్క్' ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. బీజేపీకి 85 నుంచి వంద స్థానాలు వస్తాయని పేర్కొంది. జేడీఎస్​కు గరిష్ఠంగా 32 స్థానాలు రావొచ్చని లెక్కగట్టింది.

న్యూస్‌ నేషన్‌ సీజీఎస్ ఎగ్జిట్‌ పోల్స్‌ మాత్రం 114 స్థానాలతో భాజపా అతిపెద్ద పార్టీగా నిలుస్తుందని పేర్కొంది. కాంగ్రెస్‌ 86 స్థానాల్లో, జేడీఎస్‌ 21 స్థానాల్లో విజయం సాధించే అవకాశముందని అంచనా వేసింది. సువర్ణన్యూస్‌-జన్‌కీబాత్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ భాజపాకు 94 నుంచి 117 స్థానాలు వచ్చే అవకాశముందని తెలిపింది. కాంగ్రెస్‌కు 91 నుంచి 106 స్థానాలు, జేడీఎస్‌కు 14 నుంచి 24 స్థానాలు రావచ్చని లెక్కగట్టింది.

  • 'రిపబ్లిక్ పీ-మార్క్' పోల్ ఇలా..
    • బీజేపీ: 85-100
    • కాంగ్రెస్: 94-108
    • జేడీఎస్: 24-32
    • ఇతరులు: 2-6
  • జీ న్యూస్-మాట్రిజ్ ఎగ్జిట్ పోల్
    • బీజేపీ: 79-94
    • కాంగ్రెస్: 103-118
    • జేడీఎస్: 25-33
    • ఇతరులు: 2-5
  • న్యూస్​నేషన్ సీజీఎస్ ఎగ్జిట్ పోల్
    • బీజేపీ: 114
    • కాంగ్రెస్: 86
    • జేడీఎస్: 21
    • ఇతరులు: 3
  • టీవీ9 ఎగ్జిట్ పోల్
    • బీజేపీ: 99-109
    • కాంగ్రెస్: 88-98
    • జేడీఎస్: 21-26
    • ఇతరులు: 0-4

కర్ణాటక అసెంబ్లీలో 224 స్థానాలు ఉన్నాయి. అధికారం చేపట్టాలంటే 113 స్థానాలు అవసరమవుతాయి. 2018లో ఎన్నికల్లోనూ రాష్ట్రంలో హంగ్ ఏర్పడింది. బీజేపీ 104 స్థానాలు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ 80 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. జేడీఎస్ 37 స్థానాల్లో గెలుపొందింది. ఏ పార్టీకీ మెజార్టీ రానందున.. చివరకు కాంగ్రెస్, జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే.. ఆ ప్రభుత్వం ఎంతో కాలం నిలవలేదు. బీజేపీ అధికారం చేపట్టింది.

2023 ఎన్నికల్లో కర్ణాటకలో ప్రధానంగా రెండు జాతీయ పార్టీల మధ్య పోరు నడిచింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ, అధికారంలోకి రావాలనుకుంటున్న కాంగ్రెస్ హోరాహోరీగా పోరాడాయి. మాజీ ప్రధాని దేవెగౌడ నేతృత్వంలోని జనతాదళ్ (సెక్యులర్) కింగ్ మేకర్​గా నిలవాలని భావిస్తోంది. బీజేపీ తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రచార బాధ్యతలను భుజానికెత్తుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేపట్టారు. బీజేపీ అగ్రనేతలైన అమిత్​షా, జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సైతం ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ తరఫున జాతీయ నేతలైన సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకలతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రచారాన్ని నడిపించారు.

Last Updated : May 10, 2023, 6:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.