Old couple marriage: ప్రేమ ఎంత బలీయమైందో చెప్పడానికి వారిద్దరి పెళ్లే నిదర్శనం! ఇద్దరి వయసూ 65 ఏళ్లు. ఒకరంటే మరొకరికి గాఢమైన ప్రేమ. కానీ అనుకోని పరిస్థితుల్లో ఆమెకు యుక్త వయస్సులో మరొకరితో పెళ్లయింది. ప్రేయసి దక్కలేదన్న ఆవేదనతో అతడు ఒంటరిగానే మిగిలిపోయాడు తప్ప వేరెవ్వరినీ తన జీవితంలోకి రానీయలేదు. కొంత కాలానికి ఆమె భర్త చనిపోయాడు. ఆమెకు పిల్లలు లేరు. అప్పటినుంచి ఇద్దరూ తమ పాత జ్ఞాపకాల్ని నెమరువేసుకుంటూ వేర్వేరుగానే ఉంటూ వచ్చారు.
Karnatka long love: చివరకు సమాజాన్ని, కట్టుబాట్లను కాదని వారిద్దరూ 65 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకున్నారు. గురువారం కర్ణాటకలోని మండ్య జిల్లా మేలుకోటెలో ఈ పెళ్లి జరిగింది. మేలుకోటె చెలువనారాయణుడి ఆలయానికి ఎదురుగా ఉన్న ఆశ్రమంలో మైసూరులోని హెబ్బాళ ప్రాంతానికి చెందిన చిక్కణ్ణ, అదే ప్రాంతానికి చెందిన జయమ్మ (ఇద్దరికీ 65 ఏళ్లే) శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అనంతరం సంప్రదాయం ప్రకారం ఆమెకు అరుంధతీ నక్షత్రాన్ని కూడా చూపించారు. ఇప్పుడీ లేటు వయసు పెళ్లి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఇదీ చూడండి: భార్యపై ప్రేమతో.. ఇంట్లోనే నిలువెత్తు విగ్రహం
ఇదీ చూడండి: Ideal Love Marriage: ప్రేమకి అడ్డురాని వైకల్యం... దివ్యాంగురాలిని పెళ్లాడిన యువకుడు