ETV Bharat / bharat

దీవిని తలపిస్తున్న స్కూల్​.. చుట్టూ నీరు.. లోపల 150 మంది విద్యార్థులు - వరదలో మునిగిన స్కూళ్లు

భారీ వర్షాల కారణంగా ఓ ప్రభుత్వ పాఠశాల నీట మునిగింది. 150 మంది విద్యార్థులు గంటల పాటు భవనంలోనే ఉండిపోయారు. నీటి ఉద్ధృతి తగ్గాక అధికారులు సహాయక చర్యలు చేపట్టి స్కూల్లో చిక్కుకున్న వారిని రక్షించారు. ఈ ఘటన కర్ణాటకలోని ధార్వాడ్​లో జరిగింది.

d
వరద
author img

By

Published : Jun 17, 2022, 11:51 AM IST

Updated : Jun 17, 2022, 12:31 PM IST

దీవిని తలపిస్తున్న స్కూల్

వరద ఉద్ధృతికి ఓ ప్రభుత్వ పాఠశాల నీట మునిగింది. సమీపాన ఉన్న వాగు పొంగిపొర్లడంతో భవనం చుట్టూ నీరు చేరి ప్రమాదకరంగా మారింది. దీంతో గంటల పాటు ఆ స్కూల్​లోని 150 మంది విద్యార్థులు, సిబ్బంది భవనంలోనే ఉండిపోయారు. ఈ ఘటన కర్ణాటకలోని ధార్వాడ్​ జిల్లా అమరగోల్​ గ్రామంలో గురువారం సాయంత్రం జరిగింది.

karnataka news
ప్రభుత్వ పాఠశాలను ముంచెత్తిన వరద

"గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి వర్షం మొదలైంది. ఈ క్రమంలో పక్కనే ఉన్న వాగు పొంగిపొర్లడం వల్ల వరద నీరు స్కూల్​ చుట్టూ చేసి ఉద్ధృతంగా మారింది. స్కూల్​ చుట్టూ నీరు చేరడం వల్ల వరద ఉద్ధృతి తగ్గిన తర్వాత సహాయక చర్యలు చేపట్టి విద్యార్థులను రక్షించాం." అని అధికారులు వెల్లడించారు. వరద ధాటికి ఆ పాఠశాల ఓ దీవిని తలపించిందని స్థానికులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి : స్కూల్​ బస్సుపై ఏనుగు దాడి.. డ్రైవర్​ పరార్.. వణికిన జనం​!

Last Updated : Jun 17, 2022, 12:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.