ETV Bharat / bharat

అంధుడి ఆత్మవిశ్వాసం.. కష్టపడి గవర్నమెంట్​ జాబ్​.. ఆఫీస్​లో ఫుల్​ యాక్టివ్​గా..

author img

By

Published : Jul 9, 2023, 4:34 PM IST

కంటిచూపు లేకపోతే సొంత పనులు చేసుకోవడానికే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇంట్లో చిన్న పనులు మినహా బయటకు వెళ్లాలంటే ఇతరుల సహాయం కచ్చితంగా కావాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఓ యువకుడికి రెండు కళ్లు కనిపించకపోయినప్పటికీ.. అతడు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణుడై.. ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. ఆఫీస్​లోనూ యాక్టివ్​గా పనిచేస్తూ.. సహచర ఉద్యోగులతో పోటీ పడుతున్నాడు. ఆ యువకుడు ఎవరు? ఎక్కడ పనిచేస్తున్నాడు? అతడి పూర్తి కథ మీకోసం!

Karnataka Blind Man
కార్యాలయంలో పనిచేస్తున్న సుమిత్
అంధుడి ఆత్మవిశ్వాసం.. కష్టపడి గవర్నమెంట్​ జాబ్​.. ఈజీగా డ్యూటీ

శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నప్పటికీ కొందరు.. అనుకున్న రంగంలో రాణించలేరు. కానీ పట్టుదల, సాధించాలన్న కసి ఉంటే.. అంధత్వం కూడా అడ్డంకి కాదని నిరూపించాడు కర్ణాటకకు చెందిన సుమిత్. పుట్టుకతోనే అంధుడైన సుమిత్.. తన అంగవైకల్యానికే సవాల్​ విసురుతూ ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. ఎవరి సహాయం లేకుండా సులభంగా కంప్యూటర్​ ఆపరేట్​ చేస్తూ.. ఔరా అనిపిస్తున్నాడు. ఇంతకీ అతడి కథేంటంటే?

కర్ణాటక బెళగావిలోని గోకక్ ప్రాంతానికి చెందిన సుమిత్ మోతేకర్​ పుట్టుకతోనే అంధుడు. చిన్నప్పటి నుంచి ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ.. కష్టపడి చదివాడు. తన అంగవైకల్యాన్ని సాకుగా చూపకుండా పలు ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగం చేశాడు. చివరకు పట్టుదలతో ప్రయత్నించి 2021లో బెళగావి మున్సిపల్ కార్పొరేషన్​లోని ఆరోగ్య విభాగంలో కొలువు సాధించాడు. చూపు లేకపోయినా.. ఎవరి సహాయం లేకుండా కంప్యూటర్​ను ఆపరేట్ చేస్తున్నాడు. తన వృత్తిలోని అడ్డంకులను సమర్థంగా ఎదుర్కొంటూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు సుమిత్.

సుమిత్ 'నాన్ డెస్క్​టాప్ విజువల్ ఎక్సెల్​' అనే అప్లికేషన్​ను ఉపయోగించి.. కంప్యూటర్​ను​ ఆపరేట్ చేస్తాడు. ఎవరైనా అధికారులు సుమిత్​కు ఫోన్​ చేస్తే.. అతడు 'టాక్​ బ్యాక్​' యాప్​ సహాయంతో ఎవరు ఫోన్ చేస్తున్నారో తెలుసుకొని స్పందిస్తాడు. ఈ యాప్​ ద్వారా ఎవరి సహాయం లేకుండానే వారి నెంబర్లు కూడా సేవ్ చేసుకోవచ్చని చెబుతున్నాడు. ఆఫీస్​ లెటర్లు టైప్​ చేయడం.. ఆన్​లైన్​ అప్​డేట్​ వర్క్​లాంటి ఇతర కార్యాలయ పనులన్నీ సుమిత్ సులభంగా చేస్తున్నాడు. ఈ కొలువు కోసం సుమిత్​.. కంప్యూటర్ అడ్వాన్స్​ కోర్సులో ఆరు నెలల పాటు అడ్వాన్స్ ఎక్సెల్, అడ్వాన్స్ ఎంఎస్​తో పాటు ఎవరి సహాయం లేకుండా సులభంగా పని చేయడానికి శిక్షణ తీసుకున్నాడు.

Karnataka Blind Man
కార్యాలయంలో పనిచేస్తున్న సుమిత్

"నా పేరు సుమిత్ మోతేకర్. నేను బెళగావి మున్సిపల్ కార్పొరేషన్​లో సెకండ్ డివిజన్ అసిస్టెంట్​గా ఉద్యోగం చేస్తున్నాను. బెంగళూరులో ఆరు నెలలు కంప్యూటర్ ట్రైనింగ్ తీసుకున్నాను. ఇంతకుముందు హైదరాబాద్​లో పనిచేశాను. ఇక్కడ అపాయింట్​మెంట్ లెటర్ రాగానే అక్కడ ఉద్యోగం మానేశాను. ఇక్కడ ఆఫీస్​లో సహోద్యోగులు కూడా నాకు సపోర్ట్​గా ఉంటారు. నా ఇళ్లు కూడా ఈ ఆఫీస్​ వెనకాలే ఉంటుంది. ఎవరి సహాయం లేకుండా రోజు నేను ఒక్కడినే ఆఫీస్​కు వస్తాను. NVD అనే కంప్యూటర్ స్క్రీన్​ రీడింగ్ సాఫ్ట్​వేర్​​ ద్వారా నేను టైపింగ్​ చేస్తాను. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీ సహాయంతో పని చేయగలుగుతున్నాను."

సుమిత్ మోతేకర్​, సెకండ్ డివిజన్ అసిస్టెంట్

ఈ ఉద్యోగం రాకముందు సుమిత్.. హిందుస్థాన్ కంప్యూటర్ సెంటర్​ లిమిటెడ్​లో అసోసియేట్ ఇంజినీర్​గా హైదరాబాద్, దిల్లీ నగరాల్లో పనిచేశాడు. రెండేళ్ల పాటు హెచ్​ఆర్​ విభాగంలో కూడా పనిచేసిన అనుభవం సుమిత్​కు ఉంది. కర్ణాటక తరఫున జాతీయ స్థాయి అంధుల కుస్తీ పోటీల్లో పాల్గొన్నాడు. లక్షద్వీప్​లో జరిగిన ఫుట్​బాల్ టోర్నీల్లో రెండు సార్లు పోటీలో దిగాడు. అంతేకాకుండా సాహిత్యం మీద మక్కువతో సుమిత్.. పలు నవలలు, వ్యాసాలు, కథలు కూడా రాశాడు.

"సుమిత్ మోతేకర్ బెళగావి మున్సిపల్ కార్పొరేషన్​ ఆరోగ్య విభాగంలో 2021 నుంచి ఉద్యోగం చేస్తున్నాడు. తన సహోద్యోగులతో సమానంగా సుమిత్​ పని చేస్తాడు. అతడు ఎందరికో స్పూర్తిదాయకం. ఈ ఆఫీస్​లో సుమిత్ చాలా మంది ఉద్యోగులకు ఆదర్శం"​

- అశోక దూద్​గంటి, మున్సిపల్ కమిషనర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.