మక్కల్ నీది మయ్యమ్ పార్టీ(ఎమ్ఎన్ఎమ్) అధినేత కమల్‌హాసన్ కారుపై దాడి జరిగింది. కాంచీపురంలో ఎన్నికల ప్రచారం అనంతరం హోటల్‌కు వెళ్తున్న కమల్ కారుపై ఓ దుండగుడు.. మద్యం మత్తులో దాడికి పాల్పడ్డాడు. దీంతో ఎమ్ఎన్ఎమ్ కార్యకర్తలు.. అతనిపై దాడి చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన గాంధీ రోడ్‌లోని పెరియార్ పిల్లర్ సమీపంలో జరిగిందని వివరించారు.
ఈ ఘటనలో కమల్ కారు అద్దాలు ధ్వంసమైనట్లు ఎంఎన్ఎం నేత ఏజీ మౌర్య తెలిపారు. ఇలాంటి చర్యలకు పార్టీ భయపడదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : 'ప్రతి కుటుంబానికి ఏటా 6 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ'
ఇదీ చదవండి : భాజపా గూటికి మరో డీఎంకే ఎమ్మెల్యే