ఏప్రిల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) అభ్యర్థులను ప్రకటించింది. పార్టీ అధ్యక్షుడు కమల్.. కోయంబత్తూర్ సౌత్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు. కోయంబత్తూర్లో అవినీతి పరాకాష్టకు చేరిందని గతంలోనే ఆరోపించారు కమల్. ఇప్పుడు పోటీకి ఆ స్థానాన్నే ఎంచుకున్నారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆల్ ఇండియా సమథువ మక్కల్ కట్చి(ఏఐఎస్ఎంకే), ఇండియా జననాయగ కట్చి(ఐజేకే)తో కలసి కూటమిగా పోటీ చేస్తోంది కమల్ పార్టీ. 234 స్థానాలకు గానూ 154 చోట్ల అభ్యర్థులను బరిలోకి దింపుతోంది. మిగతా 80 స్థానాల్లో మిత్ర పక్షాలకు చెరో 40 సీట్లు కేటాయించింది.
ఇదీ చూడండి: 173 మందితో డీఎంకే జాబితా- బరిలో ఉదయనిధి స్టాలిన్