కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గంలో ప్రముఖ సీనినటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్‌హాసన్ ఓడిపోయారు. అన్నాడీఎంకే కూటమి బలంతో భాజపా అభ్యర్థి వనతి శ్రీనివాసన్.. కమల్‌పై విజయం సాధించారు. కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గంలో ఇతర పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్నా.. కమల్, వనతి శ్రీనివాసన్, మయూరా జయకుమార్ మధ్యనే ప్రధాన పోటీ సాగింది.
కమల్ స్థాపించిన మక్కల్ నీది మయ్యం పార్టీ అభ్యర్థులు తమిళనాడులోని 133 స్థానాల్లో పోటీ చేశారు.
ఇదీ చదవండి : అన్నాడీఎంకేకు అదే శాపంగా మారిందా?