సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను చెన్నైలోని తన నివాసం వద్ద నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్‌హాసన్ కలిశారు. ఈ సందర్భంగా ఇరువురూ అరగంటకు పైగా చర్చించుకున్నారు.
అయితే.. ఇది మర్యాదపూర్వక సమావేశమని, రాజకీయ పరమైనది కాదని కమల్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కమల్, రజనీ సమావేశమవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చదవండి:అందుకే ఇంధన ధరల్లో పెరుగుదల: గహ్లోత్