మక్కల్ నీది మయ్యం అధినేత, ప్రముఖ నటుడు కమల్ హాసన్ నామినేషన్ దాఖలు చేశారు. కోయంబత్తూర్ సౌత్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆల్ ఇండియా సమథువ మక్కల్ కట్చి(ఏఐఎస్ఎంకే), ఇండియా జననాయగ కట్చి(ఐజేకే)తో కలసి కూటమిగా పోటీ చేస్తోంది కమల్ పార్టీ. 234 స్థానాలకు గానూ 154 చోట్ల అభ్యర్థులను బరిలోకి దింపుతోంది. మిగతా 80 స్థానాల్లో మిత్ర పక్షాలకు చెరో 40 సీట్లు కేటాయించింది.
ఏఎంఎంకే..
అమ్మ మక్కల్ మున్నెట్ర కళగం(ఏఎంఎంకే) ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్.. నామినేషన్ వేశారు. కోవిల్పట్టి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

ఇదీ చూడండి: నామినేషన్ వేసిన పళనిస్వామి, స్టాలిన్