Kalicharan Maharaj arrest: మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు కాళీచరణ్ మహరాజ్‌ను మధ్యప్రదేశ్‌లో గురువారం అరెస్ట్ చేశారు ఛత్తీస్‌గఢ్ పోలీసులు.
విశ్వసనీయ వర్గాల నుంచి అందిన పక్కా సమాచారం మేరకు మధ్యప్రదేశ్ చేరుకున్నారు రాయ్‌పుర్ పోలీసులు. ఖజురహో నగరానికి 25 కిలోమీటర్ల దూరంలోని బగేశ్వర్ ధామ్‌లో ఓ అద్దె ఇంటిలో ఉన్న కాళీచరణ్ మహరాజ్‌ను గురువారం తెల్లవారు జామున 4 గంటలకు అదుపులోకి తీసుకున్నట్లు రాయ్‌పుర్ ఎస్పీ ప్రశాంత్ అగర్వాల్ తెలిపారు. గురువారం సాయంత్రానికి రోడ్డు మార్గంలో రాయ్‌పుర్‌కు తరలిస్తామని చెప్పారు.
రాయ్‌పుర్‌లో నిర్వహించిన రెండు రోజుల ధరణ్ సన్సద్ కార్యక్రమం ముగింపు నేపథ్యంలో గురువారం సాయంత్రం.. మహాత్మా గాంధీని కించపరుస్తూ.. అనుచిత వ్యాఖ్యలు చేశారు కాళీచరణ్ మహరాజ్. మతాన్ని కాపాడుకునేందుకు హిందూ నేతను ప్రభుత్వాధినేతగా ఎన్నుకోవాలని ప్రజలను కోరారు. దీనిపై.. రాయ్‌పూర్ పోలీసులు ఐపీసీ 505(2), 294 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు మధ్యప్రదేశ్‌లో గురువారం ఉదయం అరెస్ట్ చేశారు.
గాంధీజీపై వ్యాఖ్యల నేపథ్యంలో కాళీచరణ్ మహరాజ్‌పై మహారాష్ట్రలోని అకోలాలో సైతం సోమవారం ఓ కేసు నమోదైంది.
24 గంటల్లో కోర్టు ముందుకు..
కాళీచరణ్ మహరాజ్ అరెస్ట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్. 24 గంటల్లో కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.
" కాళీచరణ్ మహరాజ్ కుటుంబానికి ఆయన న్యాయవాదికి అరెస్ట్‌పై సమాచారం అందించారు పోలీసులు. 24 గంటల్లోపు కోర్టులో హాజరుపరుస్తాం. మహాత్మాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయటంపై మధ్యప్రదేశ్ హోంమంత్రి, భాజపా నేత నరోత్తమ్ మిశ్రా సంతోషంగా ఉన్నారా? బాధపడుతున్నారా? అని చెప్పాలి. ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదు. నిబంధనల మేరకే ఛత్తీస్‌గఢ్ పోలీసులు అరెస్ట్ చేశారు."
- భూపేశ్ బఘేల్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి.
ఇదీ చూడండి: