ETV Bharat / bharat

MP Avinash Reddy: నేడు సీబీఐ ముందుకు ఎంపీ అవినాష్​ రెడ్డి.. విచారణ ఏ మలుపు తిరగబోతోంది..?

MP Avinash Reddy CBI Enquiry Today: ఓవైపు సీబీఐ నోటీసులు.. మరోవైపు దొరకని ముందస్తు బెయిలు..! మొత్తంగా మూసుకుపోయిన దారులు.! వివేకా హత్య కేసులో.. నేడు సీబీఐ బోనెక్కనున్న అవినాష్‌రెడ్డిని.. అధికారులు ఏం అడగబోతున్నారు..? ఏం చేయబోతున్నారు.? బాబాయ్‌ హత్య కేసు దర్యాప్తు ఇవాళ ఏ మలుపు తీసుకోబోతోంది.

MP Avinash Reddy
MP Avinash Reddy
author img

By

Published : May 19, 2023, 7:20 AM IST

MP Avinash Reddy CBI Enquiry Today: మాజీ మంత్రి YS వివేకానందరెడ్డి హత్య కేసులో.. సహ నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ YS అవినాష్ రెడ్డి.. మరోసారి సీబీఐ విచారణకు హాజరు కానున్నారు. ఉదయం 11 గంటలకు.. హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో హాజరు కానున్నారు. ఇందుకోసం... గురువారం సాయంత్రానికే ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. నిజానికి ఈనెల 16నే.. సీబీఐ అవినాష్‌ రెడ్డికి కబురు పంపింది. పులివెందుల నియోజకవర్గంలో.. ముందే అనుకున్న కార్యక్రమాలకు హాజరుకావాల్సి ఉందంటూ.. అవినాష్‌ 4రోజుల గడువు కోరారు. కానీ సీబీఐ అధికారులు రెండు రోజుల సమయం మాత్రమే ఇచ్చారు.

ఈ నెల 19న.. హాజరు కావాల్సిందేనంటూ నోటీసు పంపారు. ఇవాళ అవినాష్‌ రెడ్డి విచారణలో.. కీలక పరిణామాలు చోటు చేసుకునే.. అవకాశాలు కనిపిస్తున్నాయి. సీబీఐ విచారణకు పిలిచిన ప్రతిసారి.. కోర్టులో పిటిషన్లు వేస్తూ, గడువు కోరుతూ జాప్యం చేస్తూ వస్తున్న అవినాష్ రెడ్డికి,.. ఇక అన్నిదారులు మూసుకు పోయినట్లే కనిపిస్తోంది.

వివేకా కేసులో భారీ కుట్ర కోణం దాగి ఉందని,. వైఎస్​ అవినాష్ రెడ్డి, వైఎస్​ భాస్కర్​ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి అందులో.. భాగస్వాములయ్యారని సీబీఐ ఇప్పటికే అభియోగాలు మోపింది. ఈ కేసులో.. అవినాష్ రెడ్డిని సహనిందితుడని కోర్టుకు సమర్పించిన నివేదికలోనూ.. స్పష్టం చేసింది. వైఎస్​ అవినాష్‌ను అరెస్ట్ చేసి కస్టోడియల్ విచారణ చేయాల్సిన అవసరం ఉందని,. గత నెల 25న తెలంగాణ హైకోర్టులో.. సీబీఐ వేసిన కౌంటర్ అఫిడవిట్​లో స్పష్టంగా పేర్కొంది.

వివేకాను హత్య చేయడానికి ఉపయోగించిన గొడ్డలి ఎక్కడుందో.. తెలుసుకోవాలంటే అవినాష్‌ను విచారించాల్సిన అవసరం ఉందని.. తెలిపింది. వివేకా హత్యకు ముందు, ఆ తర్వాత.. ఏ2 సునీల్ యాదవ్, ఏ6 గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి.. అవినాష్ రెడ్డి ఇంట్లో ఎందుకు ఉన్నారో,. వారితో సంబంధాలేంటో తెలుసుకోవాల్సి ఉందని సీబీఐ వెల్లడించింది. నిందితులకు అందిన.. 4 కోట్ల రూపాయల లావాదేవీలు గురించీ తెలుసుకోవాల్సి ఉందని,. కోర్టుకు తెలిపింది. నేడు విచారణకు హాజరయ్యే అవినాష్​ రెడ్డిని సీబీఐ అధికారులు ఈ దిశగానే ప్రశ్నించే.. అవకాశం ఉంది. విచారణ సందర్భంగా.. సీబీఐ ఏదైనా కఠిన నిర్ణయం తీసుకుంటుందేమోననే ఆందోళనతో.. అవినాష్‌ అనుచరులు హైదరాబాద్‌ తరలివచ్చినట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.