JNTUH Doctorate to ISRO Chairman Somanath : హైదరాబాద్ జేఎన్‌టీయూ 12వ స్నాతకోత్సవంలో ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఎన్‌టీయూ వీసీ కట్ట నరసింహారెడ్డి, ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. ఉత్తమ ప్రతిభ చాటిన 54 మంది విద్యార్థులు, పరిశోధకులకు బంగారు పతకాలు, వీరితో పాటు డిగ్రీ పూర్తి చేసుకున్న ఇంజనీరింగ్, ఎంటెక్ విద్యార్థులకు యూనివర్సిటీ పట్టాలు అందించింది.
ఈ సందర్భంగా ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ (ISRO Chairman Somanath) మాట్లాడుతూ ఇండస్ట్రీ వృద్ధి, హెరిటేజ్‌లో హైదరాబాద్ ఉన్నత స్థానంలో ఉందని తెలిపారు. ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనే సామర్థ్యం ఉండాలని అన్నారు. అంతరిక్ష రంగం ప్రతి ఒక్కరినీ ఎంతగానో ఆకర్షిస్తుందని చెప్పారు. అందుకే చంద్రయాన్-3 పై ఎంతో ఆసక్తి నెలకొందని తెలిపారు. ఎంతోమందికి ఈ ప్రయోగం ఉపయోగం గురించి మొత్తం తెలియకపోవచ్చని, కానీ అందరిని ఎంతో గర్వించేలా చేసిందని పేర్కొన్నారు. గత 60 సంవత్సరాలుగా ఇస్రో ఎంతో కృషి చేస్తోందని సోమనాథ్ వివరించారు.
'చంద్రుడిపై నుంచి రాళ్లు తీసుకురావడమే టార్గెట్- అది అంత ఈజీ కాదు'
ఇస్రో (ISRO) విద్యాసంస్థలు, పరిశ్రమలతో కలిసి ముందుకు వెళ్తోందని సోమనాథ్ వివరించారు. అంతరిక్ష రంగంలో మరిన్ని అంకురాలు, పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. తన జీవితంలో ఎన్నో పరాజయాలు చూశానని వివరించారు. పరాజయం పొందినప్పుడు ఎవ్వరూ పట్టించుకోరని చెప్పారు. 2023లో తాము 3 ప్రాజెక్టుల్లో ఘన విజయం సాధించామని సోమనాథ్ తెలిపారు.
'2040 నాటికి చంద్రుడిపైకి భారత వ్యోమగామి- 2025లో ఇండియన్ స్పేస్ స్టేషన్ ప్రారంభం!'
తన జీవితంలో రాకెట్ రూపకల్పనలో ఎన్నో తప్పులు చేశానని, అపజయం గెలుపునకు పాఠం లాంటిదని సోమనాథ్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఉందని చాలా మందికి తెలియదని అన్నారు. యూనివర్సిటీలతో మరింత ఎక్కువగా కలిసి పని చేసేందుకు ఏం చేయాలో వీసీతో చర్చించినట్లు వెల్లడించారు. తక్కువ ఖర్చుతో ప్రాజెక్ట్‌లు చేసేందుకు కృషి చేస్తున్నామని, మంచి టెక్నాలజీని తక్కువ ఖర్చుతో ఎలా తీసుకురాగలమో ఆలోచించాలని సోమనాథ్ విద్యార్థులకు సూచించారు.
"వర్సిటీలతో కలిసి పనిచేయడంపై వీసీతో చర్చించాను. తక్కువ ఖర్చుతో ప్రాజెక్టులు చేసేందుకు కృషి చేస్తున్నాం. అంతరిక్ష రంగంలో మరిన్ని అంకురాలు, పరిశ్రమలు రావాలి. పరిశ్రమల వృద్ధి, హెరిటేజ్‌లో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది. చంద్రయాన్-3 దేశం మొత్తం గర్వించేలా చేసింది. పరాజయాలు అధిగమించి 3 ప్రాజెక్టుల్లో విజయం సాధించాం." - సోమనాథ్, ఇస్రో ఛైర్మన్
కృష్ణ బిలాల గుట్టు ఎక్స్‌పోశాట్‌లో- ఇకపై నెలకో కొత్త ప్రయోగం: ఇస్రో చైర్మన్ సోమనాథ్
ఐదేళ్లలో 50ఉపగ్రహాల ప్రయోగం- ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ కీలక ప్రకటన