ETV Bharat / bharat

ఆటోవాలా 'లక్షన్నర' నిజాయితీ - ఐఫోన్​

తన ఆటోలో ఓ మహిళా జర్నలిస్టు మర్చిపోయిన రూ. లక్షన్నర విలువ చేసే ఫోన్​ను తిరిగిచ్చి నిజాయితీ చాటుకున్నాడు ఆ ఆటో డ్రైవర్​. ఈ ఘటన జమ్ముకశ్మీర్​లోని శ్రీనగర్​లో జరిగింది.

Javed Ahmed
అహ్మద్ ఆటో డ్రైవర్
author img

By

Published : Mar 28, 2021, 1:22 PM IST

తన ఆటోలో మహిళా జర్నలిస్టు మర్చిపోయిన లక్షన్నర విలువ చేసే ఐఫోన్​ను తిరిగి ఇచ్చి నిజాయితీ చాటుకున్నాడా డ్రైవర్​. ఈ ఘటన జమ్ముకశ్మీర్​లోని శ్రీనగర్​లో జరిగింది.

అతని పేరు అహ్మద్​. అటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఒక రోజు శంకరాచార్య దేవాలయానికి వెళ్లాలంటూ.. ఓ మహిళ జర్నలిస్టు ఆటో ఎక్కారు. గుడి రాగానే ఆటో దిగి వెళ్లిపోయారు. అయితే ఆ ఆటోలో ఐఫోన్​ మర్చిపోయారు. ఐఫోన్​ను చూసిన అహ్మద్​.. ఆటోను వెనక్కు తిప్పాడు. ఈలోగా ఆ ఫోన్​కు కాల్​ రాగా... అసలు విషయం చెప్పాడు. ఆమెను కలిసి ఫోన్ ఇచ్చేశాడు. ఇందుకు ఆమె వచ్చి అహ్మద్​కు ధన్యవాదాలు చెప్పింది. ఆటోడ్రైవర్ ​నిజాయితీని ప్రశంసిస్తూ అహ్మద్​తో దిగిన ఫొటోను సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు.

ఇదీ చదవండి: 'సాగు చట్టాలు లేనిదే రైతు ఆదాయం రెట్టింపు అసాధ్యం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.