ETV Bharat / bharat

29 ఏళ్లు పాక్​ జైల్లో మగ్గి.. ఎట్టకేలకు స్వదేశానికి... - కుల్​దీప్​ సింగ్​

JK Man Returns to India: పాకిస్థాన్​లోని ఓ జైల్లో 29 సంవత్సరాలు చిత్రహింసలు అనుభవించాడు ఓ భారతీయుడు. ఎట్టకేలకు ఇప్పుడు స్వదేశానికి తిరిగివచ్చిన అతనికి జమ్ముకశ్మీర్​ కథువాలోని తన స్వగ్రామంలో ఘనస్వాగతం లభించింది. ఇన్నేళ్లు అక్కడ తను పడ్డ కష్టాలను వివరించాడు.

JK man returns to India after serving 29 years in Pakistan jail

author img

By

Published : Dec 28, 2021, 4:21 PM IST

Updated : Dec 28, 2021, 6:45 PM IST

పాక్​ జైల్లో 29 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష అనుభవించి స్వదేశానికి చేరుకున్న కుల్​దీప్​ సింగ్​

JK Man Returns to India: పొరపాటున సరిహద్దు దాటి, పాకిస్థాన్​ జైలులో 29 ఏళ్లు మగ్గిన ఓ భారతీయుడు.. ఎట్టకేలకు స్వదేశానికి తిరిగివచ్చాడు. డిసెంబర్​ 24న రాత్రి జమ్ముకశ్మీర్​ కథువాలోని తన స్వగ్రామం ముక్వాల్​కు చేరుకున్న కుల్​దీప్​ సింగ్.. ఘనస్వాగతం అందుకున్నాడు. అక్కడికి కుటుంబసభ్యులు, స్నేహితులు, బంధువులు, గ్రామస్థులు భారీగా చేరుకున్నారు. స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. కుల్​దీప్​కు పూలమాలలు, డబ్బుల దండలు వేసి ఆనందంగా గడిపారు.

Pakistan jail: 1992 డిసెంబర్​లో పొరపాటున అంతర్జాతీయ సరిహద్దు దాటిన కుల్​దీప్​ను పాకిస్థాన్​ సైన్యం అరెస్టు చేసింది. గూఢచర్యం కేసులో.. పాక్​ కోర్టులో నాలుగు విచారణలను ఎదుర్కొని 25 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష అనుభవించాడు. ఇన్నేళ్లు పాక్​లోని కోట్​ లఖ్​పత్​ జైల్లో ఉన్నాడు.

JK man returns to India after serving 29 years in Pakistan jail
ఆనందంతో స్వీట్లు పంచుతున్న కుల్​దీప్​ సింగ్​

Indian Man Returns From Pak Jail: ఉత్తర ప్రత్యుత్తరాలు, భారత హైకమిషన్​ న్యాయపోరాటం అనంతరం.. జైలు నుంచి విడుదలై 2021 డిసెంబర్​ 20న వాఘా సరిహద్దు గుండా కుల్​దీప్​.. అమృత్​సర్​ చేరుకున్నాడు. 24న తన స్వగ్రామానికి వచ్చాడు. కుటుంబంతో మళ్లీ కలిసినందుకు సంతోషం వ్యక్తం చేశాడు​.

భారతీయులను అక్కడ ఎలా హింసిస్తున్నారో వివరించాడు కుల్​దీప్​. పాక్​ ఆర్మీ వలలో చిక్కిన ప్రతి భారతీయుడిని గూఢచారిగా పరిగణిస్తున్నారని.. చిత్రహింసలకు గురిచేస్తున్నారని తెలిపాడు. తనను కూడా బాగా ఇబ్బందిపెట్టారని చెప్పాడు.

''నా పేరు కుల్​దీప్​ సింగ్​. మాది ముక్వాల్​. ఈ రోజు నేను చాలా చాలా సంతోషంగా ఉన్నా. నాకు ఇది మరో జన్మ. పొరపాటున పాక్​కు వెళ్లిన భారతీయులందరినీ వాళ్లు గూఢచారిగానే చూస్తారు.''

-కుల్​దీప్​ సింగ్​

జమ్ముకశ్మీర్​కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఇప్పటికీ పాక్​ జైలులో విడుదల కోసం చూస్తున్నారని కుల్​దీప్​ వెల్లడించాడు. సైన్యం చేతిలో చిత్రహింసలకు గురైన మరో 10-12 మంది భారతీయులు పాక్​లోని మానసిక ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని వివరించాడు.

కుల్​దీప్​ సింగ్​

ఇరు దేశాలు మానవత్వంతో ఆలోచించి.. ఖైదీలందరినీ విడుదల చేయాలని కుల్​దీప్​ సింగ్​ విజ్ఞప్తి చేశాడు.

ఇవీ చూడండి: ఫ్రంట్​లైన్​ వర్కర్స్​కు జనవరి 10 నుంచి మూడో​ డోసు

ఆవిర్భావ వేడుకల్లో అపశ్రుతి.. ఊడి సోనియా చేతిలో పడ్డ కాంగ్రెస్​ జెండా!

Last Updated : Dec 28, 2021, 6:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.