ETV Bharat / bharat

Vaccine: ఆ రాష్ట్రాలు భేష్- వృథాలో ఝార్ఖండ్​ టాప్​ ​ - టీకా ప్రక్రియ

కరోనా టీకాల వినియోగంలో కేరళ, బంగాల్​ రాష్ట్రాలు మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. తమకు కేటాయించిన వ్యాక్సిన్‌ డోసుల్లో ఒక్క చుక్క కూడా వృథాగా పోనివ్వకుండా ప్రజలకు అందిస్తున్నాయి. అయితే మే నెలలో ఝార్ఖండ్​కు కేటాయించిన టీకా డోసుల్లో మూడోవంతు వృథా అయినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

vaccine wastage
టీకా వృథా
author img

By

Published : Jun 10, 2021, 5:02 PM IST

దేశంలో వ్యాక్సిన్ల కొరత ఉన్న వేళ చాలా రాష్ట్రాల్లో టీకా వృథా సమస్యగా మారుతోంది. అయితే కేరళ, బంగాల్‌ మాత్రం ఇందుకు భిన్నమైన బాటలో నడుస్తూ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. వ్యాక్సిన్‌ డోసుల్లో ఒక్క చుక్క కూడా వృథాగా పోనివ్వకుండా కేటాయించిన దానికంటే ఎక్కువ మందికి టీకాలు అందిస్తున్నాయి.

మే నెలలో కేరళ తమకిచ్చిన కోటా కంటే అధికంగా 1.10లక్షల డోసులను ప్రజలకు వేసింది. బంగాల్​ 1.61లక్షల డోసులను అధికంగా అందించింది. నిజానికి వ్యాక్సిన్‌ వయల్‌లో వృథాను పరిగణనలోకి తీసుకుంటే పది డోసులు ఉంటాయి. కేంద్రం లెక్క ప్రకారం 1.1శాతం ఇందులో కలిసి ఉంటుంది. అంటే సాధారణంగా ఒక వయల్‌ నుంచి 8 నుంచి 9 డోసులు ఇవ్వగలరు. అయితే కేరళ, బంగాల్​ రాష్ట్రాలు మాత్రం ఈ వృథాను కూడా వినియోగించుకుంటున్నాయి. అలా ఒక వయల్‌ నుంచి పూర్తిగా 10 డోసులు ఇవ్వగలుగుతున్నాయి. అనుభవజ్ఞులైన వైద్య సిబ్బంది, నర్సులు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. తద్వారా ఈ రాష్ట్రాలు కేంద్రం ఇచ్చిన కోటా కంటే ఎక్కువ డోసులను ప్రజలకు అందించగలుగుతున్నాయి. టీకా డోసుల వినియోగంలో కేరళ వైద్య సిబ్బంది పనితీరుపై ఇటీవల ప్రధాని మోదీ కూడా ప్రశంసలు కురిపించారు.

ఆ రాష్ట్రంలో మూడో వంతు వృథా..

దేశవ్యాప్తంగా అత్యధిక టీకా వృథా ఝార్ఖండ్‌ రాష్ట్రంలో నమోదైంది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. ఝార్ఖండ్‌లో వ్యాక్సిన్‌ వృథా 33.95శాతంగా ఉంది. మొత్తం డోసుల్లో మూడో వంతు నిరుపయోగమవుతున్నాయి. ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో 15.79శాతం, మధ్యప్రదేశ్‌లో 7.35శాతం డోసులు వృథాగా పోతున్నాయి.

దిల్లీ, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌లోనూ ఈ వృథా 3 శాతం కంటే ఎక్కువే ఉండటం గమనార్హం. సాధారణంగా వయల్‌ తెరిచిన తర్వాత నాలుగు గంటల్లో వినియోగించాలి. లేదంటే ఆ డోసులతో ఉపయోగం ఉండదు. అయితే నలుగురైదుగురు వచ్చినా వయల్‌ ఓపెన్‌ చేసి టీకాలు ఇస్తుండటం వల్ల ఈ రాష్ట్రాల్లో వృథా అధికంగా ఉంటోంది.

ఇదీ చూడండి: టీకా తీసుకున్న వారిలో అయస్కాంత శక్తి- నిజమెంత?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.