ETV Bharat / bharat

కళ్లు లేకున్నా కుటుంబానికి అండగా, మైక్రోసాఫ్ట్​లో​ ఉద్యోగం, లక్షల్లో జీతం - దివ్యాంగుడికి 51 లక్షలతో జాబ్​

అతడికి చిన్నప్పటి నుంచి చదువంటే చాలా ఇష్టం. 11 ఏళ్ల వయసులో కంటి చూపు కోల్పోయినా దిగులు చెందలేదు. పట్టు వదలని విక్రమార్కుడిలా బ్రెయిలీ లిపిలో చదువును కొనసాగించాడు. ప్రతీ తరగతిలో అత్యధిక మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలుస్తూ వచ్చాడు. తాజాగా దిగ్గజ మైక్రోసాఫ్ట్​ కంపెనీలో రూ 51 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించాడు. ఇంతకీ అతడు ఎవరంటే

Specially abled from Jharkhand's Chatra bags Rs 50 lakhs job at Microsoft

author img

By

Published : Aug 23, 2022, 2:00 PM IST

కొందరు శారీరక వైకల్యాన్ని కారణంగా చూపుతూ ఏ పని చేయకుండా ఖాళీగా ఉండిపోతారు. మరికొందరు సవాళ్లను అధిగమించి సత్తా చాటుతారు. ఆ కోవకు చెందినవాడే ఝార్ఖండ్​లోని ఛత్రా జిల్లాకు చెందిన సౌరభ్​ ప్రసాద్​. చిన్నతనంలోనే చూపు కోల్పోయిన అతడు.. ఎలాంటి పరిస్థితుల్లోనూ కుంగిపోకుండా బ్రెయిలీ లిపిలో చదువుకుంటూ దిగ్గజ సాఫ్ట్​వేర్​ సంస్థ అయిన మైక్రోసాఫ్ట్​లో జాబ్​ సంపాదించాడు. అనుకున్నది సాధించాలనే తపన ఉంటే వైకల్యం ఎన్నటికీ అడ్డురాదని నిరూపించాడు.

జిల్లాలోని తాండ్వా బ్లాక్ ప్రాంతంలోని చట్టీగాడీలోంగ్ గ్రామానికి చెందిన సౌరభ్​ ప్రసాద్​ చిన్నప్పటి నుంచి గ్లకోమా అనే కంటి వ్యాధితో బాధపడుతున్నాడు. 11 ఏళ్ల వయసులో పూర్తిగా చూపు కోల్పోయాడు. కానీ సౌరభ్​ మాత్రం అంధత్వాన్ని ఎప్పుడూ శాపంగా భావించలేదు. అందుకే బ్రెయిలీ లిపిలో చదువుకుంటూ విద్యాభ్యాసాన్ని కొనసాగించాడు. ఎటువంటి అడ్డంకి లేకుండా సౌరభ్ చదువు ఏడో తరగతి వరకు సాగింది.

కానీ ఎనిమిదో తరగతికి వచ్చిన అతడికి పెద్ద తలనొప్పి వచ్చి చేరింది. ఎందుకంటే 8,9,10 తరగతుల పుస్తకాలు బ్రెయిలీ లిపిలో ప్రభుత్వం ముద్రించలేదు. అయితే అనేక అభ్యర్ధనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ మూడు తరగతుల పుస్తకాలను ముద్రించి సౌరభ్​కు అందించింది. పదో తరగతి పరీక్షల్లో అతడు 97 శాతంతో ఉత్తీర్ణుడయ్యాడు. ఇంటర్మీడియట్​లో అత్యధిక మార్కులు సాధించి దిల్లీ ఐఐటీలో సీటు సంపాదించాడు. ప్రస్తుతం ఇంజినీరింగ్​ సీఎస్​ఈ మూడో సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీ క్యాంపస్​లో మైక్రోసాఫ్ట్​ కంపెనీ నిర్వహించిన ఇంటర్వ్యూలో అద్భుతమైన ప్రతిభ కనబరిచి రూ.51 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించాడు.

Specially abled from Jharkhand's Chatra bags Rs 50 lakhs job at Microsoft
తల్లితో సౌరభ్​ ప్రసాద్​

సౌరభ్​కు కంటి చూపు పోయినా.. తాము ఎప్పుడూ కుంగిపోలేదని అతడి తల్లిదండ్రులు చెప్పారు. సౌరభ్​కు ప్రతిక్షణం తోడుగా ఉన్నామని, పూర్తి మద్దతు ఇచ్చామని తెలిపారు. కుమారుడి ప్రతి అడుగును తాము అనుసరిస్తున్నామని పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్​ వంటి దిగ్గజ కంపెనీలో ఉద్యోగం సంపాదించి తమ కుటుంబానికి గర్వకారణంగా నిలిచాడని అన్నారు. వైకల్యాన్ని శాపంగా భావించి అస్థిరంగా మారే చాలా మందికి సౌరభ్​ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడని గ్రామస్థులు అంటున్నారు.

ఇవీ చదవండి: హోటల్​కు బాంబు బెదిరింపు కాల్​, రూ 5 కోట్లు ఇవ్వకుంటే పేల్చేస్తామంటూ

సంతాప సభకు వెళ్లి వస్తుండగా విషాదం, ఆరుగురు దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.