ETV Bharat / bharat

గుడ్​న్యూస్.. లీటర్​ పెట్రోల్​పై రూ.25 డిస్కౌంట్​! వారికి మాత్రమే!! - పెట్రోల్ ధర ఝార్ఖండ్

Jharkhand Petrol discount: ద్విచక్రవాహనదారులకు శుభవార్త చెప్పింది ఝార్ఖండ్ ప్రభుత్వం. లీటరు పెట్రోల్​పై రూ.25 రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

petrol
పెట్రోల్
author img

By

Published : Dec 29, 2021, 3:54 PM IST

Updated : Dec 29, 2021, 5:37 PM IST

Jharkhand Petrol discount: ఆకాశాన్నంటిన పెట్రోల్‌ ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించేలా ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ కీలక ప్రకటన చేశారు. లీటరు పెట్రోల్‌పై ఏకంగా రూ.25 మేర తగ్గిస్తున్నట్టు వెల్లడించారు. కాకపోతే ఈ రాయితీ ద్విచక్రవాహనాలకు మాత్రమేనని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో జేఎంఎం ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

"పెట్రోలు, డీజిల్ ధరలు నానాటికీ పెరిగిపోతున్నందు వల్ల పేదలు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల రాష్ట్ర స్థాయిలో ద్విచక్రవాహనాలకు లీటరు పెట్రోల్‌పై రూ.25 మేర తగ్గించి ఉపశమనం కల్పిస్తున్నాం. ఈ ప్రయోజనం జనవరి 26 నుంచి అమలులోకి రానుంది"

-- హేమంత్ సొరేన్, ఝార్ఖండ్‌ సీఎం

పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారికి నెలకు 10 లీటర్ల పెట్రోల్​పై ఈ రాయితీ ఇస్తామని ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన ద్వారా తెలిపింది.

ప్రస్తుతం జార్ఖండ్​లో లీటరు పెట్రోల్ ధర రూ.98.48.

మరికొన్ని...

రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో... టూరిజం పాలసీ బుక్‌లెట్‌ను విడుదల చేశారు సోరేన్. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.

పోషకాహార లోపం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కృషి చేస్తామని సీఎం తెలిపారు. విద్యార్థుల చదువులకు ఎలాంటి ఆటంకం లేకుండా వారికి స్టూడెంట్‌ క్రెడిట్‌ కార్డులను ఇవ్వనున్నట్టు చెప్పారు.

గిరిజన వర్గాలకు చెందిన పిల్లలకు బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రాబోయే రోజుల్లో ఈ సమస్యను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి: జనావాసాల్లోకి బంగాల్​ టైగర్​.. ఆరు రోజులు వారికి చుక్కలు చూపించి...

Last Updated : Dec 29, 2021, 5:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.