ETV Bharat / bharat

కరోనా ఆంక్షల మధ్య యువకుడి 'బైక్​ బరాత్'​

author img

By

Published : Apr 25, 2021, 9:09 PM IST

కరోనా నిబంధనల మధ్య.. బైక్​పై ఓ వరుడు తన వివాహ బరాత్​ను నిర్వహించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు.. అతణ్ని ఆపి ఐదుగురు సాక్ష్యులను చూపెట్టాలని కోరారు. ఈ సంఘటన ఛత్తీస్​గఢ్​లో జరిగింది.

bike baraat
బైక్​పై బరాత్​

బైక్​పై బరాత్​

దేశవ్యాప్తంగా కరోనా ఆంక్షలు కొనసాగుతున్న వేళ.. వివాహాది శుభకార్యాలకు ఆటంకం ఏర్పడింది. పెళ్లిలో బరాత్​కు ఉన్న క్రేజ్​ వేరే. బందువుల మధ్య కారు, గుర్రపు బండి వంటి వాటిలో వరుడు ఊరేగుతాడు. కానీ, ఛత్తీస్​గఢ్​లో విధించిన ఆంక్షలు ఓ యువకుడి బరాత్​కు అడ్డువచ్చాయి. కానీ, ఆ యువకుడు కొవిడ్​ ఆంక్షలు పాటిస్తూ బైక్​తో బరాత్​ నిర్వహించాడు.

ఈ సంఘటన ఝార్ఖండ్​-ఛత్తీస్​గఢ్​ సరిహద్దులోని బలరాంపుర్​ వద్ద జరిగింది. అయితే.. ఈ బైక్​ బరాత్​ విషయం తెలుసుకున్న పోలీసులు వరుడ్ని ఆపి ప్రశ్నించారు. తన పెళ్లి జరుగుతుందనడానికి... ఐదుగురు సాక్ష్యులను చూపెట్టాలని కోరారు.

అయితే.. సదరు వ్యక్తి పోలీసుల మాటలు వినకుండా.. తన బైక్​పై ఒంటరిగా వెళ్లిపోయాడు. ఆ యువకుడి స్వస్థలం ఝార్ఖండ్​ కాగా.. ఛత్తీస్​గఢ్​లో అతని వివాహం జరగనుంది. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్​గా మారింది.

ఇదీ చూడండి: కొవిడ్​ వేళ గుర్రపు పందెం- భారీగా జనం!

ఇదీ చూడండి: బొమ్మ జీపు అడిగితే.. నిజమైనదే చేసి ఇచ్చిన తండ్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.