ETV Bharat / bharat

ముఖ్యమంత్రి నివాసంలో కొవిడ్ కలకలం.. 15 మందికి వైరస్​

Jharkhand CM Corona: ఝార్ఖండ్ సీఎం హేమంత్​ సోరెన్ ఇంట్లో కరోనా కలకలం రేపింది. హేమంత్ సోరెన్​ సతీమణి, ఇద్దరు పిల్లలకు కొవిడ్ నిర్ధరణ అయింది. సోరెన్ నివాసంలో మొత్తం 15 మందికి పరీక్షల్లో పాజిటివ్​గా తేలింది.

author img

By

Published : Jan 9, 2022, 12:08 PM IST

Jharkhand CM Corona
ఝార్ఖండ్ సీఎం హేమంత్​ సోరెన్

Jharkhand CM Corona: ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్​ సోరెన్​ ఇంట్లో 15 మందికి కొవిడ్​-19 నిర్ధరణ అయింది. వీరిలో సోరెన్ సతీమణి కల్పనా సోరెన్, ఆయన కుమారులు నితిన్, విశ్వజిత్​లూ ఉన్నారు. వీరితో పాటు సోరెన్ మరదలు సరళ మర్ముకూ వైరస్ నిర్ధరణ అయింది.

Jharkhand CM Corona
సతీమణితో ఝార్ఖండ్ సీఎం హేమంత్​ సోరెన్

అయితే హేమంత్ సోరెన్​కు మాత్రం పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. సోరెన్​తోపాటు ఆయన మీడియా సలహాదారు, అసిస్టెంట్​కు కూడా నెగెటివ్​గా తేలింది. ముఖ్యమంత్రి నివాసంలో మొత్తం 62మందికి పరీక్షలు నిర్వహించారు అధికారులు.

మరోవైపు ఝార్ఖండ్​లో కొత్తగా 5,081 మందికి వైరస్ నిర్ధరణ అయింది. మరో ముగ్గురు కొవిడ్​తో మృతి చెందారు.

కేజ్రీవాల్​కు నెగెటివ్​..

దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్​కు కొవిడ్ పరీక్షలో నెగెటివ్​గా తేలింది. తాను వైరస్​ నుంచి కోలుకున్నానని ట్వీట్ చేశారు కేజ్రీవాల్. జనవరి 4న ఆయన కొవిడ్​-19 బారిన పడ్డారు.

ఇదీ చూడండి: దేశంలో కరోనా ఉపద్రవం- ఒక్కరోజే 1.59 లక్షల కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.