పాకిస్థాన్ ఉగ్రసంస్థ జైషే మహ్మద్ దేశ రాజధాని దిల్లీలో దాడులు జరిపేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం అందిందని జమ్ముకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ అన్నారు. ఇటీవలే ఓ జైషే ఉగ్రవాది నుంచి స్వాధీనం చేసుకున్న వీడియోలో... డోభాల్ ఆఫీసు వద్ద ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించినట్లు తేలింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు దిల్లీలోని పలు ప్రాంతాల్లోనూ దాడులకు యత్నిస్తున్నట్లు తెలిసిందని సింగ్ పేర్కొన్నారు.
"కశ్మీర్లోని కొందరు ఉగ్రవాదులు.. బిహార్ నుంచి ఆయుధాలు సమకూర్చుకుంటున్నారు. ఆయుధాల రవాణా కోసం పంజాబ్లో చదువుకుంటున్న కశ్మీరీ విద్యార్థులను వినియోగించుకుంటున్నారు"
-దిల్బాగ్ సింగ్, జమ్ముకశ్మీర్ డీజీపీ
లష్కరీ ముస్తఫా, ద రెసిస్టాన్స్ ఫ్రంట్ ఉగ్రవాదులు.. హిదియాత్ ఉల్లా మాలిక్, జహూర్ అమ్మద్ రాథర్ అరెస్టు నేపథ్యంలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు దిల్బాగ్ సింగ్.
ఇదీ చదవండి:వేదిక మీదే కుప్పకూలిన ముఖ్యమంత్రి