ETV Bharat / bharat

జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల.. తెలుగు విద్యార్థులదే హవా - JEE MAIN RESULT ANNOUNCED

JEE MAIN RESULT ANNOUNCED
JEE MAIN RESULT ANNOUNCED
author img

By

Published : Jul 11, 2022, 7:52 AM IST

Updated : Jul 12, 2022, 4:00 AM IST

07:50 July 11

జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల.. తెలుగు విద్యార్థులదే హవా

జేఈఈలో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు
జేఈఈలో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు

జేఈఈ మెయిన్‌ తొలి విడత ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు విజయభేరి మోగించారు. దేశవ్యాప్తంగా 14 మందికి 100 పర్సంటైల్‌ (ఎన్‌టీఏ స్కోర్‌) దక్కగా.. వారిలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ విద్యార్థులు ఏకంగా ఏడుగురు ఉండటం విశేషం. కర్ణాటకలో పరీక్ష రాసి 100 పర్సంటైల్‌ సాధించిన విద్యార్థిది కూడా ఏపీ కావడం గమనార్హం. విజయవాడలో చదివిన గుంటూరుకు చెందిన పెనికలపాటి రవికిశోర్‌ 300కి 300 మార్కులు పొందటంతో ప్రథమ ర్యాంకర్లలో ఒకరు కాబోతున్నారు. జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ) జేఈఈ మెయిన్‌ తొలి విడత ఫలితాలను సోమవారం వెల్లడించింది. ఈ నెల 21వ తేదీ నుంచి చివరి విడత పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అవి పూర్తయిన అనంతరం రెండింట్లో వచ్చిన ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకొని ర్యాంకులను కేటాయిస్తారు. కేటగిరీల వారీగా కటాఫ్‌ స్కోర్‌ను నిర్ణయిస్తారు. దాని ప్రకారం మొత్తం 2.50 లక్షల మంది అర్హత సాధించినట్లు ప్రకటిస్తారు. వారు మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాయడానికి అర్హులవుతారు.

పరీక్ష రాసింది 7.69 లక్షల మందే: తొలి విడత మెయిన్‌కు దేశవ్యాప్తంగా మొత్తం 8,72,432 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నా వారిలో పరీక్ష రాసింది 7,69,589 మంది మాత్రమే. అందులో జనరల్‌ అభ్యర్థులు 3,19,937 మంది, జనరల్‌ ఈడబ్ల్యూఎస్‌ 74,370, ఓబీసీలు 2,75,416, ఎస్సీలు 71,458, ఎస్టీలు 26,330 మంది ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 1.25 లక్షల నుంచి లక్షన్నర మంది రాసి ఉంటారని అంచనా. తొలి విడత పరీక్షలు జూన్‌ 24 నుంచి 30వ తేదీ వరకు జరిగాయి.

గత ఏడాది అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు మెయిన్‌లో కటాఫ్‌ స్కోర్‌ ఇదీ: జనరల్‌(అన్‌రిజర్వుడ్‌): 87.8992241; ఈడబ్ల్యూఎస్‌: 66.2214845; ఓబీసీ: 68.0234447, ఎస్సీ: 46.8825338; ఎస్టీ: 34.6728999; జనరల్‌(దివ్యాంగ): 0.0096375

తెలుగు రాష్ట్రాల నుంచి కేటగిరీల వారీగా అగ్రగణ్యులు జనరల్‌ విభాగంలో..: పెనికలపాటి రవికిశోర్‌(ఏపీ), ధీరజ్‌ కురుకుంద, రూపేశ్‌ బియానీ, జాస్తి యశ్వంత్‌ వీవీఎస్‌, అనికేత్‌ ఛటోపాధ్యాయ(నలుగురూ తెలంగాణ)

జనరల్‌ ఈడబ్ల్యూఎస్‌ విభాగంలో..: పొలిశెట్టి కార్తికేయ(100), భోగి సిరి(99.9984).. వీరు ఇద్దరూ ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు.

ఓబీసీ విభాగంలో..: కొయ్యాన సుహాస్‌(100), సనపాల జశ్వంత్‌(99.9984).. వీరు ఇద్దరూ ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు

ఎస్‌సీ విభాగంలో..: దయ్యాల జాన్‌ జోసెఫ్‌(99.9953), నూతక్కి రిత్విక్‌(99.9750).. ఇద్దరూ ఏపీవారు

తెలుగు రాష్ట్రాల్లో అమ్మాయిల్లో టాపర్లు (అందరూ ఏపీవారే): దరిసిపూడి శరణ్య(99.9984), భోగి సిరి(99.9984), జానపాటి సాయిచరిత(99.9968), నక్కా సాయిదీప్తిక(99.9922), పల్లి జలలక్ష్మి(99.9875)

ప్రపంచ ప్రసిద్ధ వర్సిటీలో పీజీ చేస్తా

"జేఈఈ మెయిన్‌లో 100 పర్సంటైల్‌ సాధించడం ఆనందంగా ఉంది. అడ్వాన్స్‌డ్‌లో ఉత్తమ ర్యాంకు సాధించి ఐఐటీ బాంబేలో కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతాను. ఆ తర్వాత ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఏదో ఒక విశ్వవిద్యాలయంలో మాస్టర్స్‌ పూర్తి చేయాలన్నది నా లక్ష్యం. మాది ఉమ్మడి కృష్ణా జిల్లా గుడివాడ ప్రాంతంలోని గురజ గ్రామం. నాన్న చనిపోయారు. అమ్మ గృహిణి. పదో తరగతి వరకు విజయవాడ సమీపంలోనే చదివాను. హైదరాబాద్‌లో ఇంటర్‌ చదివాను." -జాస్తి యశ్వంత్‌ వీవీఎస్‌, హైదరాబాద్‌

బాంబే ఐఐటీలో సీఎస్‌ఈ చదువుతా

"జేఈఈ మెయిన్‌లో 100 పర్సంటైల్‌ ఊహించిందే. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో టాప్‌ ర్యాంకుపైనే నా దృష్టి. అది సాధించి ఐఐటీ బాంబేలో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ చదువుతా. మాది కర్నూలు జిల్లా. నాన్న హైదరాబాద్‌లో బ్యాంకు ఉద్యోగిగా పనిచేస్తున్నారు. అమ్మ గృహిణి. చదువు కోసం హైదరాబాద్‌లో స్థిరపడ్డాం".-ధీరజ్‌ కురుకుండ, హైదరాబాద్‌

ప్రణాళికాబద్ధంగా చదవడంతోనే..

"మా నాన్న ప్రైవేట్‌ ఉద్యోగి. అమ్మ ప్రభుత్వ ఉద్యోగి. రోజూ 16 గంటల పాటు ప్రణాళికాబద్ధంగా చదవడం, ఎప్పటికప్పుడు సబ్జెక్టుల్లో అనుమానాలు నివృత్తి చేసుకోవడం వల్ల జేఈఈలో 100 పర్సంటైల్‌ సాధ్యమైంది. ముంబయి ఐఐటీలో సీఎస్‌ఈ చేయడమే లక్ష్యం."-పి.రవికిశోర్‌, గుంటూరు

సివిల్స్‌పైనే గురి

"నాన్న ఉపాధ్యాయుడు. జేఈఈ మెయిన్‌ పరీక్షలో మంచి పర్సంటైల్‌ సాధించేందుకు రోజూ సబ్జెక్టులను అధ్యయనం చేయడం, కాన్సెప్టులను చదివాను. ముంబయి ఐఐటీలో కంప్యూటర్స్‌ సైన్స్‌లో చేరాలని ఉంది. అనంతరం సివిల్స్‌లో సత్తా చాటడమే లక్ష్యంగా పెట్టుకున్నాను." -కొయ్యాన సుహాన్‌, ఆమదాలవలస, శ్రీకాకుళం జిల్లా

సాంకేతిక పరిశోధనలపై దృష్టి

"మా నాన్న వ్యాపారవేత్త. రోజూ ఒక్కో సబ్జెక్టుకు నాలుగు గంటల సమయం కేటాయించి ఇష్టంగా చదవడం వల్ల మంచి పర్సంటైల్‌ సాధ్యమైంది. బాంబే ఐఐటీలో కంప్యూటర్స్‌ సైన్స్‌ లేదా చెన్నైలో ఈసీఈ చేయాలని ఉంది. సాంకేతిక పరిశోధనలు చేసి సత్తా చాటడమే నా లక్ష్యం." -పొలిశెట్టి కార్తికేయ, కాజీపేట, గుంటూరు జిల్లా

100 పర్సంటైల్‌ సాధించిన 14 మంది వీరే..: ధీరజ్‌ కురుకుంద, అనికేత్‌ ఛటోపాధ్యాయ, జాస్తి యశ్వంత్‌ వీవీఎస్‌, రూపేశ్‌ బియానీ(నలుగురూ తెలంగాణ), పెనికలపాటి రవికిశోర్‌, పొలిశెట్టి కార్తికేయ, కొయ్యాన సుహాస్‌(ముగ్గురూ ఏపీ), సార్థక్‌ మహేశ్వరి(హరియాణా), కుషాగ్ర శ్రీవాస్తవ(ఝార్ఖండ్‌), మృణాల్‌ గర్గ్‌(పంజాబ్‌), స్నేహ పారీక్‌్(అస్సాం), నవ్య(రాజస్థాన్‌), బోయ హరేన్‌ సాత్విక్‌(కర్ణాటక- సొంతూరు అనంతపురం జిల్లా హిందూపురం), సౌమిత్ర గర్గ్‌(యూపీ)

గురుకుల విద్యార్థుల ప్రతిభ: జేఈఈ మెయిన్‌లో సంక్షేమ గురుకులాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. గిరిజన గురుకులాలు, ఏకలవ్య ఆదర్శ గురుకులాల నుంచి 542 మంది పరీక్ష రాయగా.. 300 మంది సత్తా చాటారని సాధించారని గురుకుల సొసైటీ కార్యదర్శి రొనాల్డ్‌ రాస్‌ తెలిపారు. వీరిలో 16 మంది 90కిపైగా పర్సంటైల్‌, మరో 28 మంది 80-90 పర్సంటైల్‌ తెచ్చుకున్నారని వివరించారు.

బీసీ గురుకులాలకు చెందిన 60 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా.. 23 మంది ప్రతిభ కనబరిచారని బీసీ గురుకులాల సొసైటీ కార్యదర్శి మల్లయ్యబట్టు తెలిపారు.

ఎస్సీ గురుకులాలకు చెందిన విద్యార్థుల్లో 35 మంది 90కిపైగా పర్సంటైల్‌ తెచ్చుకున్నారని, 581 మంది ప్రతిభ కనబరిచారని గురుకుల సొసైటీ కార్యదర్శి రొనాల్డ్‌ రాస్‌ తెలిపారు. జేఈఈలో సత్తా చాటిన విద్యార్థులను ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అభినందించారు. హైదరాబాద్‌లోని గౌలిదొడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర ఐఐటీ, నీట్‌ అకాడమీ నుంచి 95 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 76 మంది ఉత్తమ ఫలితాలు సాధించారు.

Last Updated : Jul 12, 2022, 4:00 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.