ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ మెయిన్స్ మే సెషన్ వాయిదా పడింది. కరోనా రెండో దశ వ్యాప్తి కొనసాగుతున్న వేళ విద్యార్థుల భద్రత దృష్ట్యా పరీక్షను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ప్రకటించారు.
అయితే పరీక్ష కొత్త తేదీలను ఎప్పుడు ప్రకటిస్తారనేది మాత్రం వెల్లడించలేదు. సమాచారం కోసం ఎన్టీఏ అధికారిక వైబ్‌సైట్‌ను చూడమని విద్యార్థులకు సూచించారు పోఖ్రియాల్.
ఈ నెల 24 నుంచి 28 వరకు మే సెషన్లో పరీక్ష జరగాల్సి ఉంది.