SI Couple Suicide in Jangaon : జనగామలో విషాదం చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ దంపతులు ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. మొదట శ్రీనివాస్ భార్య స్వరూప ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా.. మనస్తాపంతో ఎస్సై స్నానాల గదిలో రివాల్వర్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. వివరాల్లోకి వెళితే.. శ్రీనివాస్ గత 8 సంవత్సరాలుగా జనగామలో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈరోజు ఉదయం ఆయన భార్య బాత్‌రూమ్‌లోని కిటికీకి చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయం నిద్రలేచాక ఎస్సై ఈ విషయాన్ని గమనించారు. కుటుంబసభ్యులు, స్నేహితులు ఇంటికి వచ్చి ఎస్సై శ్రీనివాస్‌ను పరామర్శించారు.
అనంతరం ఏసీపీ దేవేందర్‌రెడ్డి, పట్టణ ఇన్‌ఛార్జ్ సీఐలు శ్రీనివాస్ నివాసానికి చేరుకుని పరిశీలించారు. భార్య మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అయితే అప్పటి వరకు బెడ్‌రూమ్‌లో ఉన్న ఎస్సై శ్రీనివాస్.. వాష్‌రూమ్‌కి వెళ్తున్నానని చెప్పి లోపలికి వెళ్లాడు. తన సర్వీస్ రివాల్వర్‌తో ఒక్కసారిగా కాల్చుకున్నారు. అప్పటికే ఇంట్లో ఉన్న ఏసీపీ, సీఐలు కాల్పుల శబ్దం విని బాత్‌రూమ్‌లోకి వెళ్లి చూడగా.. శ్రీనివాస్ కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు.
రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది: విషయం తెలుసుకుని డీసీపీ సీతారామ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ దంపతులు ఆత్మహత్యకు పాల్పడటం దురదృష్టకరమని అన్నారు. ఎస్సై దంపతులకు ఇద్దరు పిల్లలున్నారని.. వారు ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నారని చెప్పారు. జనగామలో ఎస్సై దంపతులు మాత్రమే నివాసముంటున్నారని తెలిపారు. బుధవారం రాత్రి శ్రీనివాస్, స్వరూప మధ్య కుటుంబ, ఆర్థిక సంబంధిత విషయాలపై గొడవ జరిగిందన్నారు. ఎస్సై దంపతులు ఆత్మహత్యపై పూర్తిస్థాయిలో విచారణ జరిగాక మిగిలిన విషయాలు వెల్లడిస్తామని డీసీపీ స్పష్టం చేశారు.
జనగామ పట్టణ వాసులకు సుపరిచితుడుగా, స్నేహశీలిగా ఎస్సై శ్రీనివాస్‌కు మంచి పేరు ఉంది. భార్యాభర్తలు ఒక్కసారిగా ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో జనగామ పట్టణంతో పాటు, పోలీస్ విభాగంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. వీరికి ఇద్దరు కుమారులు కాగా.. పెద్ద కుమారుడి వివాహం ఇటీవల ఘనంగా జరిపించారు. కొద్ది రోజుల క్రితమే ఏఎస్ఐ నుంచి ఎస్సైగా శ్రీనివాస్ పదోన్నతి పొంది జనగామలో విధులు నిర్వర్తిస్తున్నారు.
ఇవీ చూడండి..
భర్తను హత్యచేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన భార్య.. ఆతర్వాత ఏమైదంటే
హైదరాబాద్‌లో ఉంటూ ఆస్ట్రేలియన్లకు టోకరా.. చివరకు చిక్కారిలా..