కొద్దిరోజులుగా కురుస్తున్న మంచుతో (Kashmir Snowfall) కశ్మీర్ నూతన అందాలు సంతరించుకుంది. కశ్మీర్, లద్ధాఖ్ ప్రాంతాలు ధవళ వర్ణంతో (Kashmir Snowfall) మెరిసిపోతున్నాయి. గుల్‌మార్గ్, సోనామార్గ్, పహల్‌గామ్, షోపియాన్, గురేజ్ ప్రాంతాలు భూతల స్వర్గంగా కనిపిస్తున్నాయి.
లద్ధాఖ్, ద్రాస్ ప్రాంతాల్లో రెండురోజులుగా ఏకధాటిగా మంచు కురుస్తోందని (Kashmir Snowfall) అధికారులు తెలిపారు. పుల్వామా, కుల్గాం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లోనూ మంచు కురుస్తోంది. దట్టమైన మంచు కారణంగా పలు చోట్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.
మరోవైపు పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతోంది. శ్రీనగర్ సహా పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటల వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇదీ చూడండి : ఓటమే గుణపాఠంగా.. సరిహద్దులో శరవేగంగా వసతుల కల్పన