ETV Bharat / bharat

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం.. 25 మందికిపైగా.. - jammu kashmir accident

jammu kashmir accident
jammu kashmir accident
author img

By

Published : Sep 15, 2022, 1:16 PM IST

Updated : Sep 15, 2022, 1:36 PM IST

13:13 September 15

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం.. 25 మందికిపైగా..

జమ్ముకశ్మీర్​లోని రాజౌరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూంఛ్​ నుంచి రాజౌరి వైపు వెళ్తున్న ఓ బస్సు.. మంజాకోట్​ ప్రాంతంలో అదుపుతప్పి లోయలో బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మరణించారు. మరో 25 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, సైన్యం.. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

బుధవారం.. జమ్ముకశ్మీర్​లోనే మరో ఘోర ప్రమాదం జరిగింది. పూంఛ్ జిల్లాలోని సాజియాన్ ప్రాంతంలో మినీ బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. క్షతగాత్రులను మండీలోని ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న సైన్యం.. వెంటనే సహాయచర్యలు చేపట్టింది. బస్సులో 36 మంది ప్రయాణిస్తున్నారు. పూంఛ్ నుంచి గాలి మైదాన్​కు బస్సు వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. సరిహద్దు ప్రాంతమైన సాజియాన్​లోని బ్రారీ నాలాకు రాగానే బస్సు ప్రమాదానికి గురైనట్లు చెప్పారు. పోలీసులు, ఆర్మీ, గ్రామస్థులతో కూడిన బృందం సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టినట్లు వివరించారు.

Last Updated : Sep 15, 2022, 1:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.