ముష్కర మూకతో చేతులు కలిపేందుకు సిద్ధమైన 14 మంది యువకుల మనసును పోలీసులు మార్చారు. కౌన్సిలింగ్ ఇప్పించి వారిని తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. జమ్ముకశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
సామాజిక మాధ్యమాల ద్వారా...
18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉన్న ఈ యువకులు స్థానిక ఉగ్రవాదులతో సంబంధాలు ఏర్పరుచుకున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రసంస్థల్లో చేరేందుకు సిద్ధమయ్యారు. వీరిని అనంత్‌నాగ్ జిల్లా పోలీసులు గుర్తించి తమ తల్లిదండ్రులకు మంగళవారం అప్పగించారు. ఈ కార్యక్రమంలో అనంత్‌నాగ్ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు.
కొన్ని రోజుల క్రితమే ఈ యువకులను పోలీసులు అరెస్టు చేశారు. అప్పటినుంచి వీరికి కౌన్సిలింగ్ ఇచ్చారు. తమ పిల్లలు ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారో తల్లిదండ్రులు ఎల్లప్పుడూ పర్యవేక్షిస్తూ ఉండాలని అనంత్‌నాగ్ ఎస్ఎస్పీ ఇంతియాజ్ హుస్సేన్ తెలిపారు.
"సమాజంలో గొప్ప ఆస్తి యువత. జమ్ముకశ్మీర్, దేశప్రజల పురోగతిలో వారు నిమగ్నమయ్యేలా చూడాలి. కశ్మీర్ యువ ఆస్తిని ఎవరూ దోచుకోకుండా వారి తల్లిదండ్రులు పర్యవేక్షిస్తూ ఉండాలి."
-ఇంతియాజ్ హుస్సేన్, అనంత్‌నాగ్ ఎస్ఎస్పీ
ఇదీ చూడండి: