ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​ 'కృష్ణ దాబా'పై ఉగ్రదాడి

author img

By

Published : Feb 17, 2021, 11:01 PM IST

జమ్ముకశ్మీర్​ శ్రీనగర్​లోని ప్రముఖ హోటల్​పై ఉగ్రవాద కాల్పులు కలకలం రేపాయి. సున్నిత ప్రాంతంలో జరిగిన ముష్కర దాడిలో 'కృష్ణ దాబా' యజమాని కుమారుడిపై కాల్పులు జరిపారు. 'ముస్లిం జన్​ బాజ్​' అనే నిషేధిత ఉగ్రసంస్థ ఈ కాల్పులకు బాధ్యత వహించింది.

Jammu and Kashmir: Visuals of Krishana Dabba firing incident.
జమ్ముకశ్మీర్​ 'కృష్ణ దాబా'పై ఉగ్రదాడి..

జమ్ముకశ్మీర్​లోని శ్రీనగర్​లో ప్రముఖ ఆహారశాల​పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. పటిష్ఠ సైనిక పహారా ప్రాంతంలో ఉండే 'కృష్ణ దాబా' యజమాని కుమారుడిపై ముష్కరులు అత్యంత దగ్గరగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆకాశ్ మెహ్రా అనే బాధితుడు.. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇతని పరిస్థితి విషమంగా ఉంది.

నిత్యం సైనిక పహారాలో ఉండే ఈ దాబా శాకాహార భోజనానికి ప్రసిద్ధి. శ్రీనగర్​లోని దుర్గనాగ్​ ప్రాంతంలో అత్యంత సున్నిత ప్రాంతంలో ఉంటుంది. 'ముస్లిం జన్​ బాజ్​' అనే నిషేధిత ఉగ్రసంస్థ ఈ కాల్పులకు బాధ్యత ప్రకటించుకుంది.

ప్రధాన కార్యాలయాలకు నెలవు..

భారత్​-పాక్​ ల మిలిటరీ వ్యవహారాల పరిశీలకుల కార్యాలయం(యూఎన్​ఎమ్​ఓజీఐపీ) సహా.. జమ్ముకశ్మీర్​ ప్రధాన న్యాయమూర్తి నివాసం వంటి ఉన్నత గృహసముదాయాలకు నెలవైన ఈ ప్రాంతంలో ఉగ్రదాడి జరగడం గమనార్హం. అప్రమత్తమైన పోలీసులు దగ్గరలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. మరోవైపు ఘటన అనంతరం పరుగెడుతున్న ఉగ్రవాదులను చూశామని స్థానికులు చెప్పారు.

రాయబారుల పర్యటనలో..

ఆర్టికల్​-370 రద్దు అనంతర పరిస్థితులను పరిశీలించేందుకు 24 దేశాలకు చెందిన రాయబారులు కశ్మీర్​ను సందర్శించిన రోజే ఈ ఘటన జరగడం గమనార్హం. ఇక్కడికి 2 కిమీ దూరంలోనే రాయబారులకు బస ఏర్పాట్లు చేశారు. అక్టోబర్​-2019లోనూ రాయబారుల సందర్శనలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అమాయకులైన బంగాల్​కు చెందిన ఐదుగురు వలస కూలీలను కాల్చి చంపారు. ఈ ప్రాంతానికి ప్రత్యేక హోదా రద్దుచేసిన తరువాత కశ్మీరీయేతర వ్యక్తులపై దాడులు జరగడం ఇది రెండోసారి.

ఇదీ చదవండి: కశ్మీర్​ను సందర్శించిన విదేశీ రాయబారుల బృందం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.