ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ యువతిని.. ఉపాధి కల్పిస్తామని తీసుకెళ్లి 11 మంది కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన రాజస్థాన్ జైపుర్‌లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావటంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఏం జరిగింది?
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ యువతి.. ఉపాధి కోసం 2020 అక్టోబర్‌లో రాజస్థాన్‌లోని జైపుర్‌కు వచ్చింది. మానస సరోవర్‌లోని ఓ హోటల్లో బస చేసింది. ఆమె సన్నిహితుడు ఫోన్ చేసి.. 'పని ఉంది. చేస్తే భారీగా డబ్బు ఇస్తారు'. అని చెప్పాడు. అది నిజమే అని భావించిన యువతి.. అక్కడికి వెళ్లింది. ఈ క్రమంలో మూడు కార్లలో వచ్చిన 11మంది ఆ యువతిపై కారులోనే అత్యాచారం చేశారు.
తాజాగా ఆ వీడియో వైరల్ అయింది. ఈ ఘటనపై జైపుర్ అదనపు కమిషనర్ అజయ్ పాల్ లంబా స్పందించారు. అత్యాచారం కార్లో జరిగినట్లు వీడియోలో ఉందన్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఈ కేసులో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్న బాధితురాలి చిరునామా సేకరించి.. ఆమెను జైపుర్‌కు తీసుకువచ్చినట్లు తెలిపారు. ఇప్పటికే ఓ నిందితున్ని అదుపులోకి తీసుకున్నామన్నారు.
ఇదీ చదవండి : బాణసంచా ఫ్యాక్టరీ ప్రమాదంలో 25కు మృతులు