ETV Bharat / bharat

ప్రేమోన్మాది ఘాతుకం.. ప్రేయసి, ఆమె సోదరుడ్ని చంపి పోలీస్ స్టేషన్​కు - uttarpradesh gangrape

ప్రియురాలు, ఆమె సోదరుడ్ని దారుణంగా హత్య చేశాడు ఓ ప్రేమోన్మాది. అనంతరం పోలీస్ స్టేషన్​లో లొంగిపోయాడు. రాజస్థాన్ జైపుర్​లో ఈ ఘటన జరిగింది. ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన మరో ఘటనలో 14 ఏళ్ల బాలికపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

Man killed lover
ప్రేమోన్మాది ఘాతుకం.. ప్రేయసి, ఆమె సోదరుడ్ని చంపి పోలీస్ స్టేషన్​కు
author img

By

Published : May 5, 2022, 10:58 PM IST

Man killed lover: రాజస్థాన్​ జైపుర్​లోని హసన్​పురలో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రియురాలు, ఆమె సోదరుడ్ని దారుణంగా హత్య చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్​కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఈ హత్యలకు పాల్పడిన నిందితుడి పేరు గుల్షాన్​. హసన్​పురలో నివాసముండే 17 ఏళ్ల పూనం , ఇతను కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. గురువారం ఆమెను కలిసేందుకు వెళ్లాడు. అనంతరం ఇద్దరూ ఏదో విషయంలో గొడవపడ్డారు. ఈ క్రమంలోనే కోపంలో గుల్షాన్ పూనంపై పదునైన ఆయుధంతో దాడి చేశాడు. అడ్డువచ్చిన ఆమె సోదురుడిని కూడా తీవ్రంగా గాయపరిచాడు. దీంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. అనంతరం నిందితుడు పోలీస్​ స్టేషన్​కు వెళ్లి లొంగిపోయాడు. చనిపోయిన ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

మైనర్​పై గ్యాంగ్​రేప్​..: ఉత్తర్​ప్రదేశ్ రుధౌలి పోలీస్ స్టేషన్​ పరిధిలో దారుణం జరిగింది. 14 ఏళ్ల బాలికపై ముగ్గురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయటకు వెళ్లినప్పుడు పొదల్లోకి లాక్కెళ్లి ఈ క్రూర చర్యకు పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. బాధితురాలు ఇంటికి వెళ్లాక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే వారు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు 24 గంటల్లోనే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టం సహా పలు సెక్షన్ల కింద నిందితులపై కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి: మహిళ వీరంగం.. పోలీసులపై చెప్పుతో దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.