ETV Bharat / bharat

Rape: లిఫ్ట్​ ఇచ్చి.. యువతిపై అత్యాచారం - జైపుర్ క్రైమ్ న్యూస్

లిఫ్ట్​ ఇచ్చి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు. ఈ ఘటన రాజస్థాన్​ జైపుర్​లో జరిగింది.

jaipur rape
గ్యాంగ్ రేప్, జైపుర్
author img

By

Published : Jun 8, 2021, 12:03 PM IST

రాజస్థాన్​ జైపుర్​లో దారుణ ఘటన జరిగింది. లిఫ్ట్​ ఇచ్చి.. ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి ఓ యువతిపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు.

బాయ్​ఫ్రెండ్​తో గొడవ...

సరదాగా పార్టీ చేసుకునేందుకు భాంకరోటాలోని ఓ హోటల్​కు వెళ్లింది ఓ జంట. ఈ క్రమంలో ఇరువురి మధ్య గొడవ జరిగింది. అనంతరం భాంకరోటా బైపాస్ రోడ్డు​ సమీపంలోనే ప్రియురాలిని దింపేసి వెళ్లిపోయాడు ప్రియుడు.

అదే మార్గంలో కారులో వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు ఆ యువతికి లిఫ్ట్ ఇచ్చారు. గుర్తుతెలియని ప్రదేశానికి తీసుకెళ్లి.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.

ఘటన అనంతరం.. భాంకరోటా పోలీసు స్టేషన్​లో​ ఫిర్యాదు చేసింది యువతి. దీంతో.. యువతి ప్రియుడిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాలిని ఆసుపత్రికి పంపించారు. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్​లను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఘటనతో సంబంధమున్న కొందరు యువతను కస్టడీకి తరలించిన పోలీసులు.. ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఇదీ చదవండి:Viral​: చిన్నారులతో మద్యం తాగించిన బంధువులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.