తమిళనాడులో ఓ శునకం ఎంచక్కా షాపింగ్ చేస్తోంది. తన యజమానికి కావాల్సిన వస్తువులను ఒక్కటి కూడా పోగొట్టకుండా ఇంటికి తీసుకువస్తోంది. మిగిలిన అరకొర చిల్లరను వదిలిపెట్టకుండా అణా పైసాతో సహా లెక్కను అప్పజెప్తోంది.


తమిళనాడు దిండిగుల్ జిల్లా పళనిలోని దాస్ ఫెర్నాండెజ్ పెంపుడు కుక్క జాక్ స్పారో. నాలుగేళ్ల వయసు ఉండే ఈ లాబ్రడార్ జాతి కుక్కకు.. చిన్నప్పటి నుంచే దుకాణానికి వెళ్లి వస్తువులు తీసుకురావడాన్ని యజమాని అలవాటు చేశారు. దాస్ ఇచ్చిన చీటీతో దుకాణానికి వెళ్లి, అక్కడి వారు ఇచ్చే వస్తువులను ఇంటికి తీసుకొస్తుంది. జాక్ స్పారో షాపింగ్‌ను స్థానికులంతా ఆసక్తిగా చూస్తుంటారు.
ఇదీ చూడండి: క్యాబ్ డ్రైవర్ చెంప దెబ్బ ఘటనలో ట్విస్ట్