Chinar Corps News: భారత సైన్యం మరోసారి ధైర్యసాహసాలను ప్రదర్శించింది. హిమపాతంలో చిక్కుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఫజలీ బేగం అనే మహిళను కాపాడింది భారత సైన్యం. అనారోగ్యంతో బాధపడుతున్న సదరు మహిళను బందీపూర్ జిల్లా బరౌబ్ ప్రాంతం నుంచి స్ట్రెచర్‌పై హెలిప్యాడ్ వద్దకు తరలించారు.
సుమారు 1.5 కిలోమీటర్లు ఐదు అడుగుల మంచులోనే ప్రాణాలకు తెగించి సదరు మహిళను హెలిప్యాడ్ వద్దకు చేర్చారు. అక్కడినుంచి బందిపోరా జిల్లాలోని ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు చినార్ కార్ప్స్ ఆర్మీ బృందం ట్వీట్ చేసింది.
ప్రస్తుతం శ్రీనగర్‌లో ఉష్ణోగ్రతలు అత్యల్పస్థాయికి చేరినట్లు వాతావరణ శాఖ అధికారు తెలిపారు. అత్యల్పంగా మైనస్ 8.1 డిగ్రీలుగా నమోదు అయ్యాయని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: పైనుంచి రైలు.. ట్రాక్ మధ్యలో నక్కి బాలికను కాపాడిన యువకుడు